Assembly Result: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఫలితాలు ఎలా ఉండనున్నాయి.. మ్యాజిక్ ఫిగర్ ఎంత..

|

Dec 03, 2023 | 7:35 AM

రెండు పక్కపక్క రాష్ట్రాల్లో పోరు మామూలుగా లేదు. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో హోరా హోరీ ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో 52జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2,533 మంది అభ్యర్థులు పోటీలో దిగగా ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Assembly Result: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఫలితాలు ఎలా ఉండనున్నాయి.. మ్యాజిక్ ఫిగర్ ఎంత..
What Will Be The Results In Madhya Pradesh And Chhattisgarh
Follow us on

రెండు పక్కపక్క రాష్ట్రాల్లో పోరు మామూలుగా లేదు. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో హోరా హోరీ ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో 52జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2,533 మంది అభ్యర్థులు పోటీలో దిగగా ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు చూపించాయి. రెండో సారి కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ అన్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా మ్యాజిక్ ఫిగర్ 116 రావాలి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా.. బీజేపీ 109 కే పరిమితం అయింది. ఆ తరువాత క్యాంపు రాజకీయాలు నిర్వహించి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి ఎలాంటి ఫలితాలు రానున్నాయన్న దానిపై అందరూ దృష్టి సారించారు.

ఇక ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.181 మంది అభ్యర్థుల బరిలో నిలువగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగల్ మరో సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కాంగ్రెస్‌ను ప్రజలు గద్దెదించేందుకు సిద్దమయ్యారని రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కైవసం చేసుకోవాలి. 2018లో కాంగ్రెస్ 71, బీజేపీ 14, సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఫలితాలు ఎలా ఉండనున్నాయో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..