కోల్‌కతా యువ డాక్టర్ మర్డర్ కేసులో ఎవరెవరున్నారు..? సీబీఐ విచారణలో ఏం తేలింది?
కోల్‌కతా యువ డాక్టర్ మర్డర్ కేసులో 'పెద్ద కుట్ర' దాగి ఉందని, దాని వెనుక ఎవరున్నారు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై తాలా పోలీస్ స్టేషన్ మాజీ OC అభిజిత్ మండల్, RG మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌లను సీబీఐ అరెస్టు చేసింది.
కోల్‌కతా యువ డాక్టర్ మర్డర్ కేసులో ‘పెద్ద కుట్ర’ దాగి ఉందని, దాని వెనుక ఎవరున్నారు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై తాలా పోలీస్ స్టేషన్ మాజీ OC అభిజిత్ మండల్, RG మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌లను సీబీఐ శనివారం(సెప్టెంబర్ 14) రాత్రి అరెస్టు చేసింది. ఆదివారం అభిజీత్ మండల్, సందీప్ ఘోష్‌లను సీల్దా కోర్టులోని రెండవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జడ్జి పమేలా గుప్తా ముందు హాజరుపరిచారు. సీల్దా కోర్టు నిందితులు ఇద్దరినీ మూడు రోజుల పాటు సీబీఐ రిమాండ్‌కు ఆదేశించింది.
ఆగస్టు 9న, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో యువ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నివేదికలో యువ డాక్టర్‌పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత కోల్‌కతా పోలీసులు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత, దర్యాప్తు సందర్భంగా, RG మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ OC అరిజిత్ మండల్ సహా 100 మందిని సీబీఐ విచారించింది. ఇప్పుడు ఈ కేసులో సందీప్ ఘోష్, అరిజిత్ మండల్‌లను తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఘటన జరిగిన రోజు రాత్రి ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఓసీ అభిజిత్ మండల్ మధ్య సంభాషణ జరిగిందని సీబీఐ కోర్టులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐకి లభించాయి.
ఈ అంశాన్ని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో, అభిజీత్ మండల్ సంభాషణను ఖండించారు. సిబిఐ లాయర్ కోర్టును అడిగారు, సిడిఆర్‌లో సందీప్‌తో సంభాషణ ఉంది. దీని వెనుక ఏదో కుట్ర ఉండవచ్చు. దాన్ని నిజంగా ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. సందీప్, అభిజిత్‌లను ముఖాముఖిగా క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నామని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నిందితులను ఇద్దరిని సీబీఐ కస్టడీకి అప్పగించింది కోర్టు.
అంతేకాదు ఓసీ అభిజిత్ పాత్ర అనుమానాస్పదంగా ఉంది. నిజానిజాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోలీసుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. అత్యాచారం, హత్య కేసుల్లో అతడు జాగ్రత్తగా వ్యవహరించలేదు. ఆధారాలు ధ్వంసం చేశారు. పోస్ట్‌మార్టం, వేలిముద్రలు, పాదముద్రలు కూడా ధ్వంసమయ్యాయని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఇదిలావుండగా, తన క్లయింట్‌కు 6 నోటీసులు ఇచ్చారని అభిజీత్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. వెళ్లిన ప్రతిసారీ.. మెడికల్ లీవ్ లో ఉన్నాడు. చివరికి శనివారం నాటి విచారణలో అతడిని అరెస్టు చేసేందుకు దారి తీసింది. కాగా, అరెస్ట్ మెమో కుటుంబానికి ఇవ్వలేదని అభిజీత్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రౌండ్ అరెస్ట్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. అయితే అభిజీత్‌ను నిందితుడిగా పరిగణించడం లేదని, మూడు రోజుల కస్టడీ కోరుతున్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..