Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.! ఆ తర్వాత జరిగిందిదే

జాతీయ రహదారిపై వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీ కొట్టింది. అనంతరం లారీ కొక్కానికి కారు ఇరుక్కుపోవడంతో.. లారీ డ్రైవర్‌ ఆపకుండా కారును కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.! ఆ తర్వాత జరిగిందిదే
Road Accident On Highway In Uttar Pradesh

Updated on: Jul 04, 2025 | 6:21 PM

లక్నో, జులై 4: జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ.. అదే రోడ్డుపై వెళ్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కొక్కానికి కారు ఇరుక్కుపోయింది. ఇంత జరిగినా లారీ డ్రైవర్‌ ఆపకుండా కారును ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు రూపం లేకుండా నుజ్జునుజ్జయ్యింది. ఈ దారుణ ఘటన యూపీలో సీతార్‌పూర్‌ ఏరియాలో జాతీయ రహదారి 30పై చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో నేషనల్ హైవే-30 పై ట్రక్ డ్రైవర్ కారును పక్క నుంచి ఢీకొట్టి.. దాదాపు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని సీజ్‌ చేశారు.

కాగా గత నెల 15నలో కూడా సీతార్‌పూర్‌ ఏరియాలో వివాహ వేడుకకు వెళుతున్న నలుగురు టీనేజర్లు ఇదే రహదారిపై మృత్యువాత పడ్డారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కన వెళ్తున్న కారుపై బోల్తా పడటంతో.. అందులోని నలుగురు యువకులు కారులో ఇరుక్కుపోయి స్పాట్‌లోనే మృతి చెందారు. స్థానికులు ఆ నలుగురినీ బయటకు తీసి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కానీ వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.