Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. వెలుగులోకి లైవ్ వీడియో.. ఇక్కడ చూడండి..

|

Jun 08, 2023 | 6:50 PM

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టి ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఈ ప్రమాదంపై అనేక ఆరోపణలు, సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి లైవ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. వెలుగులోకి లైవ్ వీడియో.. ఇక్కడ చూడండి..
Odisha Train Tragedy
Follow us on

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొట్టి ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఈ ప్రమాదంపై అనేక ఆరోపణలు, సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి లైవ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన తీరు ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబందించినది కాగా, అందులో స్వీపర్స్ బోగీలను క్లీన్ చేస్తున్నారు. ఈ క్లీనింగ్ సర్వీస్‌ను కొందరు ప్యాసింజర్స్ వీడియో తీశారు. వీడియో రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే రైలు భారీ కుదుపులకు గురైంది. ప్రమాదంతో చీకటి కమ్మేసింది. ప్యాసింజర్స్ అరుపులు, కేకలు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ రైలు ప్రమాదంలో మొత్తం 278 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో.. నెటిజన్లు ఆ వీడియో చూసి బాధను వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మళ్లీ కూత పెట్టిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌..

మొన్ననే ఘోర ప్రమాదానికి గురయింది. వందలమంది ప్రాణాలు పోయాయి. దేశం మొత్తం దిగ్భాంతి చెందింది. రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఆ రైలు మళ్లీ ఇప్పడప్పుడే పట్టాలు ఎక్కుతుందా.. ఎక్కగలదా అనుకున్న తరుణంలో.. యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌ అంటూ మళ్లీ పట్టాలపై దూసుకొచ్చేసింది.

ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత ట్రైన్ మళ్లీ పరుగులు తీసింది. ప్రమాదం తర్వాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ తొలిసారి ఏపీలోకి వచ్చింది. ఇంజన్‌ మార్చడంతో పాటు.. డ్యామేజి అయిన బోగీలను తొలగించారు రైల్వే అధికారులు. కాగా, సిగ్నల్స్ బట్టి ట్రాక్‌ను ఫాలో అవుతామని లోకోపైలట్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 130kph స్పీడ్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..