CM Mamata Banerjee: కుక్కపిల్లతో కలిసి దీదీ వర్కవుట్.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న సీఎం మమతా వీడియో..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజనం లైక్ చేస్తున్నారు. ఈ వీడియోతో పాటు మోటివేషనల్ క్యాప్షన్ కూడా ఇచ్చారు దీదీ. అంతే కాదు ట్రెడ్‌మిల్‌పై మమతా నడుస్తుండటం..

CM Mamata Banerjee: కుక్కపిల్లతో కలిసి దీదీ వర్కవుట్.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న సీఎం మమతా వీడియో..
CM Mamata Banerjee workout
Follow us

|

Updated on: May 08, 2023 | 12:50 PM

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వర్కౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చిన్న బొచ్చు కుక్కతో కలిసి దీదీ ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు. ఆమె ఒక అందమైన, చిన్న గోధుమరంగు కుక్కపిల్లని ఊయల వేస్తూ ట్రెడ్‌మిల్‌పై నడుస్తోంది. మమత కుక్కపిల్ల మీద నుంచి కళ్ళు తీయలేకపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవుతున్నవారిని మరింత ఆకట్టుకునేందుకు ఈ వీడియోకు అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. “కొన్ని రోజులు మీకు అదనపు ప్రేరణ కావాలి!” ఆమె చివర్లో ఒక అందమైన కుక్క ఎమోజీని కూడా జోడించారు. అయితే, ఈ వీడియోపై కామెంట్స్ చేయడానికి వీలు లేదు. ఎదుకంటే ఆ ఆప్షన్‌ను మమతా బ్లాక్ చేశారు. ఈ వార్తల రాస్తున్నప్పటికే ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

ఆదివారం (మే 7), బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కౌట్ వీడియో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో దీదీ తన చేతిలో చిన్న కుక్కపిల్లతో ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నట్లు చూడవచ్చు.

ఈ వీడియోను ఇప్పటివరకు 24,000 మందికి పైగా లైక్ చేసారు. అయితే, వీడియోపై వ్యాఖ్యలు నిలిపివేయబడ్డాయి. అందుకే కామెంట్ లేదు. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజ్లర్ల నిరసనకు ముఖ్యమంత్రి కూడా తన మద్దతును తెలిపారు.

ప్రతిపక్షాలు ఏకం కావాలని కోరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల విషయంలోనూ టీఎంసీ అధినేత బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు బీజేపీ ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తోందని.. అయితే ఓట్లు రాబట్టేందుకు దర్యాప్తు సంస్థలు సహకరించవని మమతా బెనర్జీ శుక్రవారం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకమై బీజేపీతో కలిసి పోరాడాలని మమత కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం