Viral Video: బైక్‌, కుక్కను అమాంతం మింగేసిన భారీ గొయ్యి.. షాకింగ్ సీసీటీవీ వీడియో..

దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రెండు బైకులు, ఓ కుక్కను అమాంతం మింగేసింది భారీ గొయ్యి. అప్పటి వరకు బాగానే ఉన్న రోడ్డు..

Viral Video: బైక్‌, కుక్కను అమాంతం మింగేసిన భారీ గొయ్యి.. షాకింగ్ సీసీటీవీ వీడియో..
Road Collapsed

Updated on: Feb 25, 2023 | 5:14 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రెండు బైకులు, ఓ కుక్కను అమాంతం మింగేసింది భారీ గొయ్యి. అప్పటి వరకు బాగానే ఉన్న రోడ్డు.. సెకన్లలో కుప్పకూలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని ఆర్కే పురంలో ఓ గల్లీలో రెండు బైక్స్ పార్క్ చేసి ఉంచారు. ఆ రెండు బైక్‌ల నీడల మధ్య ఓ కుక్క పడుకుంది. అయితే, బైక్స్ పార్క్ చేసిన చోట నాలా ఉంది. ఉన్నట్లుండి నాలాపై వేసిన రోడ్డు కుంగిపోయింది. మొదట ఒక బైక్, పక్కనే పడుకున్న కుక్క ఆ గుంటలో పడిపోగా.. ఆ కాసేపటికే మరో బైక్ కూడా కుప్పకూలింది. రోడ్డు కుంగిన చోట కొందరు జనాలు కూడా ఉన్నారు. వారు వెంటనే అలర్ట్ అయి పక్కకు జరిగడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు కుంగుబాటు ఘటన అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. చాదర్‌ఘాట్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కింద నాళాలు కారణంగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..