Watch Video: కర్ర సాయంతో చెప్పు తీసుకోబోయి.. నదిలో కోట్టుకుపోయిన యువకుడు! షాకింగ్ వీడియో
నదిలో పడిన చెప్పును కర్రతో అందుకోబోయి.. పట్టుతప్పి ఓ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోనిలో శనివారం (జులై 19) చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన యువకుడు అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఉన్న పరేవా ఖోహ్ స్థానికంగా పర్యాటక స్థలంగా ఖ్యాతి చెందింది. వర్షాకాలంలో నిండుగా పొంగే నదిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. కొండల నడుమ ప్రవహించే ఈ నది చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం సెలవు ఆయుశ్ (20) ఐదుగురు స్నేహితులతో కలిసి ‘పరేవా ఖోహ్’కు సరదాగా వెళ్లాడు. అయితే అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా నదిలో పడిపోయింది.
నీళ్లలో తేలుతున్న ఆ చెప్పు నీటి అలల ధాటికి కొండరాళ్ల పైకివస్తూ పోతూ ఉంది. దీంతో అతడు ఓ కర్ర సాయంతో చెప్పును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహంలో చెప్పు కొంచెం ముందుకు వెళ్లింది. ఆయుష్ కూడా రాళ్ల మీదుగా అక్కడికి పరుగులు తీశాడు. అయితే చెప్పు ఉన్న చోట కాస్త చేతితో అందుకునేలా ఉండటంతో ఆయుష్ చేయి చాపబోయాడు. దీంతో రాళ్లపై ఉన్న పాచి కారణంగా పట్టుతప్పి అతడు నీళ్లలో పడిపోయాడు.
मध्य प्रदेश के सिवनी में पिकनिक पर गया 20 साल का युवक नदी में बह गया। पूरी घटना कमेंट में पढ़िए#SeoniTragedy #MadhyaPradesh #MPNews #RiverAccident #PicnicTurnsTragic #Reel#PEDDIFestiveIn250Days#Saiyaara#7thPayForBPSCTeachers pic.twitter.com/o1YA6UeIU2
— KHABAR WALA (@diwanjournalist) July 20, 2025
ఆ సమయంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకుని బయటకు వచ్చేందుకు యత్నించాడు. కానీ నదిలో ప్రవాహం దాటికి పట్టుదొరక్కా స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు ఏం చేయాలో తెలియక భోరున ఏడుస్తూ అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. వారు పోలీసులకు తెలిపారు. ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనంలేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆయుష్ మృతదేహాన్ని బయటకు తీసింది. ఈ సంఘటనకు చెందిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




