దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. వీధి కుక్కల దాడిలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా.. వందల మంది గాయపడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వృద్ధుడిపై కుక్కలు విరుచుకుపడ్డాయి. ఒకేసారి దాదాపుగా అరడజనుకు పైగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మృతుడు యూనివర్సిటీ క్యాంపస్‌లోని పార్క్‌లో 65 ఏళ్ల డాక్టర్ సఫ్దర్ అలీగా గుర్తించారు. డాక్టర్ సఫ్దర్ అలీ ఆదివారం ఉదయం వాకింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతదేహం క్యాంపస్‌లో రక్తపు మడుగులో పడిఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతమంతా పరిశీలించారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. బాధితుడిపై పది కుక్కుల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పదే పదే దాడి చేయడంతో పాటు కుక్కలన్నీ అతన్ని నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలతో సఫ్దర్ అలీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
*NEWS ALIGARH UP*
अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी कैम्पस में सुबह टहलने गए सफदर अली नाम के व्यक्ति का मिला शव,,, कैंपस में स्थित एक डिपार्टमेंट के लॉन में सफदर का शव मिलने से मचा हड़कंप,, @Uppolice @AMUofficialPRO @kuldeep_gunawat pic.twitter.com/4jUuxpTniR
— M A K (@wassey_pur) April 16, 2023
యూనివర్సిటీ క్యాంపస్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అలీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో బయటకు రావాలన్నా, తిరగాలన్నా భయంతో వణికిపోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..