వేసవి సెలవుల కోసం వెళ్లి.. సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం తహశీల్దార్!
సిక్కిం వరదల్లో విజయనగరం జిల్లా తహసీల్దార్ చిక్కుకుపోయారు. వేసవి సెలవులు కావడంతో తహసీల్దార్ కూర్మనాథ్ ఐదు రోజుల కిందట కుటుంబసభ్యులతో కలిసి గ్యాంగ్‌టక్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మరో 15-20 కి.మీ దూరంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వారు వెళ్లిన మార్గం వరద నీటితో మూసుకుపోయింది.

సిక్కిం వరదల్లో విజయనగరం జిల్లా తహసీల్దార్ చిక్కుకుపోయారు. వేసవి సెలవులు కావడంతో తహసీల్దార్ కూర్మనాథ్ ఐదు రోజుల కిందట కుటుంబసభ్యులతో కలిసి గ్యాంగ్‌టక్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మరో 15-20 కి.మీ దూరంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వారు వెళ్లిన మార్గం వరద నీటితో మూసుకుపోయింది. దీంతో వారు పర్యాటక ప్రదేశంలో బస చేసిన హోటల్‌లోనే సురక్షితంగా ఉన్నారు. రూట్ క్లియర్ అయిన తర్వాత మళ్లీ గ్యాంగ్‌టక్‌కు చేరుకునే అవకాశం ఉంది.
తహసీల్దార్ కూర్మనాథ్ కుటుంబసభ్యులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చర్యలు చేపట్టారు. సిక్కిం డీజీపీ, అధికారులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. తహసీల్దార్ కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు సిక్కిం డీజీపీ తెలిపారు. మరోవైపు ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ కూడా సిక్కిం అధికారులతో సంప్రదింపులు జరిపారు. తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
సిక్కిం రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. ముఖ్యంగా 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తీస్తా నది నీటి మట్టం ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ పెరుగుదల మంగన్, గ్యాల్షింగ్, సోరెంగ్ జిల్లాలలో వరదలు, లాండ్‌స్లైడ్‌లు సంభవించే ప్రమాదాన్ని పెంచింది. భారత వాతావరణ శాఖ మే 31 శనివారం సిక్కింలోని మంగన్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
