వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్నని జంటకు నరకం చూపించిన గ్రామస్తులు.. ఇద్దరినీ ఒకేచోట కట్టేసి.

| Edited By: Janardhan Veluru

Sep 06, 2024 | 6:12 PM

ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతరిక్షాన్ని జయించిన మనిషి, మనుషుల్లోని అరాచకవాదాన్ని మాత్రం అనిచివేయలేకపోతున్నాడు. తాజాగా జరిగిన ఓ సంఘటన అసలు మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా..

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్నని జంటకు నరకం చూపించిన గ్రామస్తులు.. ఇద్దరినీ ఒకేచోట కట్టేసి.
Crime News (representative image)
Follow us on

ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతరిక్షాన్ని జయించిన మనిషి, మనుషుల్లోని అరాచకవాదాన్ని మాత్రం అనిచివేయలేకపోతున్నాడు. తాజాగా జరిగిన ఓ సంఘటన అసలు మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అన్న ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ఓ వివాహిత పెళ్లికాని యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. గత రాత్రి మహిళ బంధువులు వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  అనంతరం ఆగ్రహించిన గ్రామస్తులు ఇద్దరినీ ఒకే తాడులో కట్టి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ రక్షించారు.  అనంతరం జంటను ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక గ్రామస్థులు జంటపై దాడి చేస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్‌ చేస్తోంది. రక్తం వచ్చేట్లు విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవేళ జంట నిజంగానే తప్పు చేసి ఉంటే చట్ట పరంగా శిక్షించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..