Vijay Sethupathi: విజయ్ సేతుపతిని తన్నిన వారికి నగదు రివార్డు.. బీజేపీ నాయకుడు సంచలన ప్రకటన..
Vijay Sethupathi: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జాతీయ అవార్డును అందుకుని తిరిగి తమిళనాడుకు చేరుకున్న
Vijay Sethupathi: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే జాతీయ అవార్డును అందుకుని తిరిగి తమిళనాడుకు చేరుకున్న విజయ్ సేతుపతిపై విమానాశ్రయంలో ఓ అగంతకుడు తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతిపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ హిందూ వాది అర్జున్ సంపత్ పేరిట మక్కల్ కట్చి సంస్థ సంచలన ట్వీట్ చేశారు. విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి ప్రోత్సాహకంగా నగదు రివార్డు ఇస్తామంటూ ప్రకటించారు. ఒక్కో దెబ్బకు రూ. 1001 బహుమతి ఇస్తామని ప్రకటించారు.
నటుడు విజయ్ సేతుపతిని తన్నినందుకు అర్జున్ సపంత్ క్యాష్ ప్రైజ్ ఇస్తారని హిందూ అనుకూల గ్రూప్ హిందూ మక్కల్ కట్చి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. అయ్య తేవర్‌ను విజయ్ సేతుపతి అవమానించాడని, ఈ విషయంలో విజయ్ సేతుపతి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టవద్దని అన్నారు. క్షమాపణలు చెప్పే వరకు.. ప్రతి తన్నుకు రూ.1001 రివార్డును అందజేస్తారని ప్రకటించారు.
Arjun Sampath announces cash award, for kicking actor Vijay Sethupathi for insulting Thevar Ayya.
1 kick = Rs.1001/- for any one who kicks him, until he apologises. pic.twitter.com/Fogf7D9V7S
— Indu Makkal Katchi (Offl) ?? (@Indumakalktchi) November 7, 2021
ఈ ప్రకటనపై అర్జున్ సంపత్‌ను మీడియా ప్రతినిథులు సంప్రదించగా.. తానే ప్రకటించానని అంగీకరించారు. తేవర్ అయ్యర్‌ను అవమానించినందుకే ఇలా మాట్లాడినట్లు సంపత్ తెలిపారు. విజయ్ సేతుపతిపై దాడి చేసిన మహాగాంధీతో మాట్లాడానని, అయ్య తేవర్‌పై వ్యంగంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై దాడి చేసినట్లు తెలిపాడని అన్నారు.
Also read:
Yoga Poses: కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ యోగాసనాలను ప్రయత్నించండి..
Tip Tip Barsa Pani: ఆ రాగం ఏది.. ఆ శృతి ఏది.. కత్రినా హాట్ సాంగ్‌పై నెటిజన్ల ఫైర్..