Yoga Poses: కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ యోగాసనాలను ప్రయత్నించండి..
Yoga Poses: యోగా మీ కాళ్లను బలోపేతం చేయడానికి, కండరాల తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది. కాలి కండరాల నొప్పులను..
Yoga Poses: యోగా మీ కాళ్లను బలోపేతం చేయడానికి, కండరాల తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది. కాలి కండరాల నొప్పులను దూరం చేయడానికి ఏ యోగాసనాలు వేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తన్‌పదాసనం శవాసనంలో వెల్లకిలా పడుకోవాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ వీపును కొద్దిగా వంచి, తలను వెనుకకు వంచాలి. దీని తరువాత, మీ అరచేతులను నేలపై గట్టిగా ఉంచి, మీ పాదాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతూ నెమ్మదిగా పైకి లేపాలి. ఆ తరువాత చేతులను కూడా నెమ్మదిగా పైకి లేపాలి. ఈ సమయంలో సాధారణ శ్వాస తీసుకోవాలి. భంగిమలో కొంత సమయం పాటు ఉండాలి. ఆ తరువాత శ్వాసను వదులుతూ మీ పాదాలను, చేతులను నెమ్మదిగా కిందకు దించాలి. ఈ ఆసనాన్ని ఐదు సార్లు చేయాల్సి ఉంటుంది.
ఉత్కటాసన ముందుగా నిటారుగా నిల్చోవాలి. ఆ తరువాత శ్వాస వదులుతూ మోకాళ్లను వంచాలి. కుర్చీపై కూర్చున్నట్లుగా కూర్చోవాలి. పొత్తి కడుపును లోపలికి, బయటకు అనాలి. మీ కాలి వేళ్లను చూడగలిగేలా, తుంటిని వీలైనంత వరకు వెనక్కి ఉంచాలి. ఆ తరువాత మీ చెవుల మీదుగా చేతులను పైకి లేపండి. ఇలా కాసేపు ఉండి తిరిగి అదే స్థితిలోకి రవాలి.
అనంతాసనం ఈ ఆసనాన్ని మకరాసనంతో ప్రారంభించాలి. ఆ తరువాత శ్వాస తీసుకుంటూ ఎడమ వైపునకు తిరగాలి. ఎడమ చేతిని వంచి, ఎడమ మోచేయిపై శరీరాన్ని సమతుల్యం చేయాలి. ఇప్పుడు మీ తలని మీ ఎడమ అరచేతిపై ఉంచండి. తుంటికి ఎడమ వైపున పడుకుని, రెండు కాళ్ళను పూర్తిగా విస్తరించండి. మీ శరీరాన్ని ముందుకు లేదా వెనుకకు కదలకుండా మోచేయి నుండి మడమ వరకు మీ మొత్తం శరీరాన్ని ఒకే వరుసలో ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ, కుడి కాలును పైకి లేపి, స్ట్రెచ్‌తో చేతిని పైకి లేపి, కుడి వేళ్లతో కుడి బొటనవేలును పట్టుకోండి. ఈ స్థితిలో, మీ కుడి కాలును వీలైనంత వరకు నిఠారుగా ఉంచండి. ఆ తరువాత నెమ్మదిగా శ్వాస వదులుతూ సాధారణ స్థితిలోకి రావాలి. ఈ భంగిమలో కొంతసేపు చేసి.. ఆ తరువాత మరో కాలితో చేయాలి.
Also read:
Tip Tip Barsa Pani: ఆ రాగం ఏది.. ఆ శృతి ఏది.. కత్రినా హాట్ సాంగ్‌పై నెటిజన్ల ఫైర్..
India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. యాక్టివ్‌గా ఎన్ని ఉన్నాయంటే..?