PM Modi: ఆత్మనిర్భర్ భారత్ దిశగా గుజరాత్.. సెమీ కండక్టర్ల తయారీ రంగానికి కీలక దశ: ప్రధాని మోడీ

|

Sep 13, 2022 | 3:03 PM

సెమీకండక్టర్ తయారీలో భాగంగా రూ. 1.54 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్, వేదాంత ఫాక్స్‌కాన్ గ్రూప్ సంయుక్తంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడంతోపాటు.. ఉద్యోగాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు.

PM Modi: ఆత్మనిర్భర్ భారత్ దిశగా గుజరాత్.. సెమీ కండక్టర్ల తయారీ రంగానికి కీలక దశ: ప్రధాని మోడీ
Pm Modi
Follow us on

India’s semi-conductor manufacturing: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదం ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) దిశగా గుజరాత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా భూపేంద్ర పటేల్ ప్రభుత్వం సెమీ కండక్టర్ల తయారీకి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సెమీకండక్టర్ తయారీలో భాగంగా రూ. 1.54 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్, వేదాంత ఫాక్స్‌కాన్ గ్రూప్ సంయుక్తంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడంతోపాటు.. ఉద్యోగాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీనిపై ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ఈ అవగాహన ఒప్పందం భారతదేశ సెమీ కండక్టర్ల తయారీ ఆశయాలను వేగవంతం చేసే ఒక ముఖ్యమైన దశ అంటూ పేర్కొన్నారు. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలను పెంచడానికి మరింత దోహదపడతాయి. ఇది అనుబంధ పరిశ్రమల కోసం భారీ పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తుంది. ఇంకా MSMEలకు సహాయపడుతుంది.. అంటూ ప్రధాని ట్విట్ చేసి పేర్కొన్నారు.

అంతకుమందు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్ ట్విట్ చేసి వెల్లడించారు. ప్రధాని మోడీ ఆశయాలను నిర్వర్తించే దిశగా గుజరాత్ ప్రభుత్వం.. కీలక ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో గుజరాత్ విధాన ఆధారిత రాష్ట్రంగా మారింది. ఇటీవల గుజరాత్ డెడికేటెడ్ సెమీకండక్టర్ పాలసీని ప్రారంభించింది. #DoubleEngineSarkar ఈ ఒప్పందం గుజరాత్ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులను మరింత పెంచుతుంది.

కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో కుదిరిన ఈ ముఖ్యమైన అవగాహన ఒప్పందం ప్రకారం.. దేశంలోని రాష్ట్రాల్లో సెమీకండక్టర్ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. ఇది ఉద్యోగావకాశాలను మరింత పెంచుతుంది. రాష్ట్రంలో లక్ష మంది యువతీయువకులకు ఉపాధినిస్తుంది అని సీఎం పేర్కొన్నారు.

ఇది తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. సెమీకండక్టర్ల తయారీ రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చాలనే ప్రధానమంత్రి సంకల్పాన్ని నిర్వర్తించేందకు గుజరాత్ చొరవ తీసుకుని రాష్ట్రంలో సెమీకండక్టర్ , డిస్ప్లే ఫ్యాబ్ తయారీకి వేదాంత-ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో రూ.1.54 లక్షల కోట్ల అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది’’. అని భూపేంద్ర పటేల్ ట్విట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం