Viral Video: గుజరాత్‌లో ఉద్యోగ ప్రకటన.. గ్రామ రక్షక్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎలా క్యూ కట్టారో చూడండి.. వీడియో

Gram Rakshak Dal Recruitment: గుజరాత్‌లో గ్రామ రక్షక్ దళ్‌ (Gram Rakshak Dal) లో 600 పోస్టుల భర్తీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నియామక ప్రక్రియ కోసం రాష్ట్రంలోని

Viral Video: గుజరాత్‌లో ఉద్యోగ ప్రకటన.. గ్రామ రక్షక్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎలా క్యూ కట్టారో చూడండి.. వీడియో
Gram Rakshak Dal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 28, 2021 | 10:00 AM

Gram Rakshak Dal Recruitment: గుజరాత్‌లో గ్రామ రక్షక్ దళ్‌ (Gram Rakshak Dal) లో 600 పోస్టుల భర్తీ ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నియామక ప్రక్రియ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఈ ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జి చేసి నిరుద్యోగులను నిలువరించాల్సి వచ్చింది. అయితే.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య ఎలా వెంటాడుతుందో ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

గుజరాత్‌లో గ్రామ రక్షా దళ్‌లో 600 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని బనస్కతలోని పాలన్‌పూర్ ప్రాంతంలో చేపట్టిన గ్రామ రక్షక్ దళ్ నియామక ప్రక్రియ కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వేలాది మంది అభ్యర్థులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రదేశం మొత్తం కిక్కిరిసిపోయింది. ఒకనొక సమయంలో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడటంతో.. ఈ రద్దీని నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అభ్యర్థులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

గ్రామ స్థాయి పోస్టుల కోసం ఈ స్థాయిలో నిరుద్యోగులు రావడం.. నిరుద్యోగ సమస్యకు అద్దం పట్టినట్లు ఉందని పలువురు పేర్కొంటున్నారు. గ్రామీణ ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్థులను చూసి నిరుద్యోగాన్ని సులభంగా అంచనా వేయవచ్చని.. విపక్షాలు అధికార పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గ్రామ రక్షక్ దళ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళంగా మారింది.

వీడియో.. 

అయితే.. శనివారం పాలన్‌పూర్‌లో కూడా జీఆర్‌డీ రిక్రూట్‌మెంట్ మేళా నిర్వహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న ఈ రిక్రూట్‌మెంట్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అభ్యర్థులు అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. రాష్ట్రంలో నిర్వహించే జీఆర్డీ ఉద్యోగ మేళాలు అంతటా ఇలాంటి గందరగోళ పరిస్థితే నెలకొందని పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

India Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Crime News: ఉన్మాది బీభత్సం.. ఇనుప రాడ్డుతో కొట్టి ఎస్ఐ సహా ఐదుగురి హత్య..