Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తుఫాన్ బీభత్సం.. దెబ్బతిన్న 40 బోట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం..

అకస్మాత్తుగా మారిన వాతావరణం ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా, తెహ్రి సరస్సు వద్ద పెను విధ్వంసం నెలకొంది. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది..

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తుఫాన్ బీభత్సం.. దెబ్బతిన్న 40 బోట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం..
Uttarakhand Cyclone
Follow us
Surya Kala

|

Updated on: May 11, 2022 | 2:15 PM

Uttarakhand: దేవభూమి ఉత్తరాఖండ్ లో తుఫాన్ (Cyclone) బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ తుఫాను కారణంగా, తెహ్రి డ్యామ్ (Tehri Dam)వద్ద ఉన్న బోటింగ్ పాయింట్‌లో భయాందోళనలు ఉన్నాయి. ఈ తుపాను ధాటికి 40 బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

అకస్మాత్తుగా మారిన వాతావరణం ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా, తెహ్రి సరస్సు వద్ద పెను విధ్వంసం నెలకొంది. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అదే సమయంలో, తెహ్రీలో తుఫాను కారణంగా, డ్యామ్ సరస్సులో ఆగి ఉన్న చాలా పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో తెహ్రీ సరస్సులో చాలా ఇంజన్ బొట్లు మునిగిపోయాయని బోటు నిర్వాహకులు తెలిపారు. 40కి పైగా పడవలు దెబ్బతిన్నాయి.

సాయంత్రానికి కోటికలోని బోటింగ్ పాయింట్ వద్ద పార్క్ చేసిన పదుల సంఖ్యలో పడవలు భారీగా దెబ్బతిన్నాయి. సరస్సులో తుపాను బలంగా ఉండడంతో బోటులో ఉన్న ప్రయాణికులను బోటు డ్రైవర్లు తీవ్రంగా శ్రమించి సురక్షితంగా కాపాడారు. సరస్సులో తుఫాను వచ్చినప్పుడు, గందరగోళం ఏర్పడింది. 6 సంవత్సరాల తర్వాత తెహ్రీ సరస్సులో ఇంత భయంకరమైన తుఫాను వచ్చిందని స్తానికులు చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగా తెహ్రీలో బోటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ తుఫాను తెహ్రీ లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

2016 తర్వాత ఈ రేంజ్ లో తెహ్రీ సరస్సులో తుపాను బీభత్సం సృష్టించిందని..  పడవలకు ఇంత నష్టం వాటిల్లిందని బోట్ నిర్వాహకులు చెబుతున్నారు. తమను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ 104 బోట్లు ఉన్నాయని.. అయితే వాటిని కట్టడానికి జెట్టీ తీసుకురాలేదు. 40 బోట్లను మాత్రమే జెట్టీకి కట్టి ఉంచారని.. ఇది  తెహ్రీ లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్లక్ష్యాన్ని  చూపిస్తోందంటూ.. బోటు డ్రైవర్లు ఆరోపించారు.

సరస్సు ఒడ్డున నిలిపి ఉంచిన పడవలకు భద్రత కల్పించాలని, దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లించాలని బోట్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని, పాలకవర్గాన్ని కోరుతున్నారు. సరస్సులో జెట్టీల సంఖ్యను పెంచాలని, తుపాను కారణంగా బోటు నిర్వాహకులకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని, బోటింగ్ ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని బోట్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..