AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omega Healthcare: రానున్న 12 నెలల్లో 18,000 నియామకాలు చేపట్టనున్న ఒమేగా హెల్త్‌కేర్‌.. ఎక్కడెక్కడంటే..

భారత్‌లో వచ్చే 12 నెలల్లో 18,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు అమెరికా సంస్థ ఒమేగా హెల్త్‌కేర్‌ ప్రకటించింది..

Omega Healthcare: రానున్న 12 నెలల్లో 18,000 నియామకాలు చేపట్టనున్న ఒమేగా హెల్త్‌కేర్‌.. ఎక్కడెక్కడంటే..
Omega Hiring
Srilakshmi C
|

Updated on: May 11, 2022 | 2:26 PM

Share

Omega Healthcare To Hire 18,000 Professionals in this year: భారత్‌లో వచ్చే 12 నెలల్లో 18,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు అమెరికా సంస్థ ఒమేగా హెల్త్‌కేర్‌ (Omega Healthcare) ప్రకటించింది. ఈ 18,000 నియామకాల్లో 4,500 ఉద్యోగాలను వచ్చే రెండు నెలల్లో భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్‌, బెంగళూరు (Bengaluru), చెన్నై కార్యాలయాల్లో ఉద్యోగుల నియామకాలు ఉంటాయని పేర్కొంది. రెవెన్యూ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ప్రాసెస్‌, ఖాతాదారులకు సపోర్ట్‌ సేవలను అందించే ఒమేగా హెల్త్‌కేర్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26,000 మంది ఉద్యోగులున్నారు. వచ్చే 12 నెలల్లో భర్తీ చేయబోయే 18,000 ఉద్యోగాలకు ఏ విభాగానికి చెందిన పట్టభద్రులు అయినా దరఖాస్తు చేసుకోవచ్చని, తక్కువ పని అనుభవం ఉన్నా పర్వాలేదని ఒమేగా హెల్త్‌కేర్‌ హెచ్‌ఆర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ బరేకెరీ తెలిపారు. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నమన్నారు.

Read Also:

TISS Mumbai Jobs 2022: నెలకు రూ.70000లజీతంతో.. బీఈ/బీటెక్‌ అర్హతతో టిస్ ముంబాయిలో ఉద్యోగాలు..పూర్తివివరాలివే!