AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్ లో ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు, 34 మందిని కాపాడేందుకు ముమ్మర యత్నాలు

ఉత్తరాఖండ్ లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తపోవన్ హైడల్ ప్రాజెక్టు సమీపంలోని సొరంగంలో చిక్కుకున్న 34 మందిని రక్షించే క్రమంలో సహాయక బృందాలు..

ఉత్తరాఖండ్ లో ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు, 34 మందిని కాపాడేందుకు ముమ్మర యత్నాలు
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 13, 2021 | 5:36 PM

Share

ఉత్తరాఖండ్ లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తపోవన్ హైడల్ ప్రాజెక్టు సమీపంలోని సొరంగంలో చిక్కుకున్న 34 మందిని రక్షించే క్రమంలో సహాయక బృందాలు మరో ముందడుగు వేశాయి. ప్రధాన టనెల్ కి సమాంతరంగా మరో సొరంగాన్ని డ్రిల్ చేసేందుకు ఇవి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనివల్ల ఇందులో చిక్కుకున్నవారిని సాధ్యమైనంత త్వరగా రక్షించగలుగుతామని ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. 75 మీ.మీ. వెడల్పు, 12 మీటర్ల పొడవైన హోల్ ను డ్రిల్ చేయగలిగామని, ఇక్కడ పెద్దగా నీరు లేకపోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కెమెరాను జొప్పించలేకపోయామన్నారు. పడిపోయిన కొండ శిఖరాలు,  బండ రాళ్ళు, ఎగుడు, దిగుడు మార్గాలు సహాయక చర్యలను అడ్డుకుంటున్నాయన్నారు.

ఇలా ఉండగా రిషిగంగా నదీ నీటి ప్రవాహమంతా ఒకే చోట చేరడంతో ఛమోలీ జిల్లాలో కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఇది ఈ లోయకు కొంత ప్రమాదకరమేనని వాడియా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ రీసెర్చర్లు తెలిపారు. ఈ సరస్సు 60 మీటర్ల ఎత్తు, 350 మీటర్ల వెడల్పు ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ సరస్సు సమీపానికి వెళ్లరాదని స్థానికులకు అలర్ట్ హెచ్చరికను జారీ చేసినట్టు జిల్లా మేజిస్ట్రేట్ స్వాతి బదోరియా తెలిపారు. జియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన 8 మంది సభ్యుల బృందం ఇక్కడ పర్యటించి త్వరలో తమ నివేదికను సమర్పించనుందన్నారు. uttarakhand rescue teams cut through to side tunnel, uttarakhand, chamoli dist, rescue teams, tunnel, drill, 34 trapped

మరిన్ని చదవండి ఇక్కడ: Double Pregnancy Woman: సైన్స్‌కే సవాల్.. గర్భంతో ఉన్న మహిళ మూడు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ! మరిన్ని చదవండి ఇక్కడ: President Joe Biden: వైట్ హౌస్ లాన్స్ లో..వేలంటైన్ డే నాడు, జో బైడెన్, జిల్ ‘ప్రేమ గుర్తులు’, యూనిటీ, లవ్