బాబా రామ్‌దేవ్‌కు మరో షాక్‌..! పతంజలికి చెందిన 5 మందులపై నిషేధం.. మెడికల్‌ మాఫియా అంటూ..

|

Nov 12, 2022 | 1:54 PM

వైద్య ప్రపంచంలో గందరగోళం, భయంతో వ్యాపారం చేసే వారు తమపై ఇలాంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆయుర్వేద మందులకు వ్యతిరేకంగా మాఫియా ముఠా పని చేస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఈ కుట్రను బట్టబయలు చేస్తామని నాథ్ అన్నారు.

బాబా రామ్‌దేవ్‌కు మరో షాక్‌..! పతంజలికి చెందిన 5 మందులపై నిషేధం.. మెడికల్‌ మాఫియా అంటూ..
Patanjalis
Follow us on

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మరోమారు షాక్‌ తగిలినంతపనైంది. బాబా రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి కంపెనీ తయారు చేస్తున్న 5 రకాల మందులపై నిషేధం విధిస్తూ ఉత్తరాఖండ్ ఆయుర్వేద, యునాని సర్వీసెస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దివ్య మధుకృతి, దివ్య ఇగ్రిడ్ గోల్డ్, దివ్య థైరోగ్రిడ్, దివ్య బిబిగ్రిడ్, దివ్య లిడిమ్ అనే 5 ఔషధాల ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ ఆయుర్వేద మరియు యునాని సర్వీసెస్ అథారిటీ అక్రిడిటింగ్ అధికారి డాక్టర్ జిసిఎస్ జంగ్‌బంకి పతంజలిని ఆదేశించారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్‌కు విరుద్ధంగా ఉన్నందున ఈ మందులను నిషేధించినట్లు ఉత్తరాఖండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కంట్రోల్ అథారిటీ తెలిపింది. ఈ 5 మందులు మధుమేహం, కంటి దెబ్బతినడం, థైరాయిడ్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కోసం అందిస్తున్నారు.

దివ్య మధుకృతి, దివ్య ఇగ్రిడ్ గోల్డ్, దివ్య థైరోగ్రిడ్, దివ్య పిపిగ్రిడ్, దివ్య లిడిమ్ అనే 5 ఔషధాల కూర్పుపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించామని ఉత్తరాఖండ్ ఆయుర్వేద, యునాని సర్వీసెస్ అథారిటీ అక్రిడిటేషన్ అధికారి డాక్టర్ జిసిఎస్ జంగ్‌బాంగి తెలిపారు. ఒక వారంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ 5 ఔషధాల ఉత్పత్తిని ప్రారంభించవద్దని పతంజలి కంపెనీని ఆదేశించినట్టుగా ఆయన వివరించారు.

కేరళకు చెందిన వైద్యుడు కేవీ బాబు చేసిన ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ ఆయుర్వేద, యునాని సర్వీసెస్ కమిషన్ చర్యలు చేపట్టింది. తన ఫిర్యాదులో, “పతంజలి కంపెనీ ఇచ్చిన ప్రకటనలో తమ ఉత్పత్తి ఐ డ్రాప్స్ గ్లాకోమా, క్యాటరాక్ట్‌లతో సహా వివిధ వ్యాధులను నయం చేస్తుందని పేర్కొంది. ఈ వ్యాధులకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తే, అది దృష్టిని కోల్పోవచ్చు. ఇలాంటి ప్రకటనలు మానవ జీవితానికి ప్రమాదకరమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

కానీ పతంజలి కంపెనీ ఇచ్చిన సమాధానంలో, “దివ్య ఫార్మసీ ద్వారా తయారు చేయబడిన అన్ని మందులు ప్రభుత్వం అందించిన నాణ్యత, నాణ్యత నియంత్రణతో తయారు చేయబడ్డాయని వివరించారు. వైద్య ప్రపంచంలో గందరగోళం, భయంతో వ్యాపారం చేసే వారు తమపై ఇలాంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆయుర్వేద మందులకు వ్యతిరేకంగా మాఫియా ముఠా పని చేస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఈ కుట్రను బట్టబయలు చేస్తామని నాథ్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి