నోయిడా: బ్యాడ్మింటన్ ఆడుతూ 52 ఏళ్ల వ్యక్తి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ 11 నివాసిస్తున్న మహేంద్ర శర్మగా పోలీసులు గుర్తించారు. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తోటి ఆటగాళ్లతో కలిసి శర్మ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. నోయిడా స్టేడియంలోని అత్యవసర వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శర్మను బతికించేందుకు పీసీఆర్ చేశారు. అనంతరం అతన్ని హుటాహుటీన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐతే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇండోర్ స్టేడియంలో కుప్పకూలిన శర్మకు వైద్యులు పీసీఆర్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు సెక్టార్ 24 పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ ఆఫీసర్ అమిత్ కుమార్ మీడియాకు తెలిపారు.
हंसते खेलते एक और कहते। नोएडा में बैडमिंटन खेलते हुए एक 50 साल के व्यक्ति की मौत ही गई। उन्हें कोर्ट पर ही बचाने की कोशिश hue लेकिन नहीं बच सके।
अब ICMR भी ऐसी मौत पर रिसर्च कर रहा है। pic.twitter.com/oBDpgVhhXp— Narendra nath mishra (@iamnarendranath) June 10, 2023
మృతుడు తన స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడేందుకు గత ఐదేళ్లుగా స్టేడియానికి వస్తున్నాడని స్టేడియంకు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. కాగా గత బుధవారం 24 ఏళ్ల రాష్ట్ర స్థాయి వాలీబాల్ మహిళా వాలీబాల్ క్రీడాకారిణి సలియాత్ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ మరణాలకు గల కారణాలపై పరిశోధనలు ముమ్మరం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.