UP Blast: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు సజీవ దహనం.. పలువురికి సీరియస్
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కౌశాంబి జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలోని షరాఫత్ అలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు ఇక్కడ పెళ్లిళ్ల కోసం పటాకులు తయారు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. కాగా ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎస్పీతోపాటు పలు పోలీస్ స్టేషన్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. కాగా, ఫ్యాక్టరీలో 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున స్పాట్ కు చేరుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు.
#WATCH कौशांबी: SP बृजेश कुमार श्रीवास्तव ने कहा, "एक पटाखा फैक्ट्री में आग लगी है और हादसे में 4 लोगों की मृत्यु हुई है। कुछ घायल हुए हैं, जिन्हें अस्पताल में भर्ती कराया गया है। बचाव अभियान जारी है…" https://t.co/FdqsqTg78g pic.twitter.com/1JqCoxFniH
— ANI_HindiNews (@AHindinews) February 25, 2024
ఈ బాణాసంచా ఫ్యాక్టరీ చాలా కాలం నుంచి టపాసులను తయారు చేస్తోంది. అయితే.. ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్ తీసుకున్నారా లేదా అనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రికి సమగ్ర సమాచారం అందించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
