Kanpur Car Driver: హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు చలాన్.. ట్రాఫిక్ పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యువకుడు..!
టూ వీలర్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా.. మోటార్ సైకిల్ లేదా స్కూటర్‌లో వెళుతున్నపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే, ఈ ఫోటోలో ఓ వ్యక్తి కారు నడుపుతూ హెల్మెట్ ధరించాడు.
Kanpur Car Driver wearing helmet: టూ వీలర్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా.. మోటార్ సైకిల్ లేదా స్కూటర్‌లో వెళుతున్నపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే, ఈ ఫోటోలో ఓ వ్యక్తి కారు నడుపుతూ హెల్మెట్ ధరించాడు. ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారాయి. కారులో సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణించాల్సిన వ్యక్తి హెల్మెట్ ఎందుకు ధరించాడనేదే కదా మీ ప్రశ్న.. కారులో అలా హెల్మెట్‌తో డ్రైవింగ్ చేయడానికి వెనుక పెద్ద కథే ఉందండీ..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం బయటపడింది. హెల్మెట్ ధరించలేదని ఓ కారు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. కారులో ప్రయాణిస్తున్నపుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులకు అతనికి జరిమానా విధించారు. అవును, మీరు చదివింది అక్షరాలా నిజమే! నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్ ప్రాంతంలో నివసించే విశాల్ మిశ్రా.. ఆగస్టు 31న.. తన మారుతి షిప్టు కారులో వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించినట్లు అతని సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేశారు. ఇంటికి తిరిగి వచ్చాక, మొబైల్‌లో మెసేజ్ ద్వారా ఆన్‌లైన్ చలాన్ గురించి సమాచారం అందింది. అతను సందేశాన్ని చదివినప్పుడు, హెల్మెట్ ధరించి కారు నడపనందుకు అతనికి రూ.1000 జరిమానా విధించినట్లు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ అని విశాల్ మిశ్రా అన్నారు.
దీంతో ఖంగుతిన్న సదరు యువకుడు పోలీసులకే మతిపోయే పని చేశాడు. అతను చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారాయి. అయితే, ముందుజాగ్రత్తగా ట్రాఫిక్ పోలీసులు మళ్లీ అతని చలాన్ కట్ చేయకుండా ఇప్పుడు అతను హెల్మెట్‌తో కారు నడుపుతున్నాడు. ఒకవైపు హెల్మెట్‌తో కారు నడుపుతున్న విశాల్ మిశ్రా వ్యవహారం కాన్పూర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి చిత్రాలు సోషల్ మీడియాలో వెరల్‌గా మారడంతో నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులను దుమ్మెత్తిపోస్తున్నారు.
పోలీసులు ఇలా అంసంభందమైన చలానాలు ఇవ్వడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలో గోవాలో ఓ మోటార్ సైకిల్ రైడర్ సీట్ బెల్ట్ ధరించలేదని కూడా జరిమానా విధించారు. అక్కడ కూడా కానిస్టేబుల్ పొరబాటు బయటపడింది. నిబంధనల ప్రకారం, కారులో సీట్ బెల్ట్ మరియు బైకు మీద హెల్మెట్ ఖచ్చితం అని మాత్రమే ఉంది. కానీ బైకు మీద సీట్ బెల్ట్ కారులో హెల్మెట్ తప్పనిసరి అని ఎక్కడా లేదు. అకారణంగా పోలీసులు చలానా జారీ చేశారు. నిజానికి ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించినా కూడా హెల్మెట్ లేదనే కారణం చేత జరిమానా విధించడంతో ఇది కూడా రూల్ అనుకుని ఆ డ్రైవర్ అప్పటి నుండి హెల్మెట్ ధరించి వాహనాన్ని నడుపుతున్నాడు. ఇలా అనవసరంగా ఏ కారణాలు లేకుండా జరిమానాలు విధించకుండా పోలీసులకు అవగాహన కల్పించాలని జనం కోరుకుంటున్నారు.
Read Also… Yadadri miracles: యాదాద్రి అద్భుతాలు. లక్ష్మీ పుష్కరిణికి జలాలు.. వైటీడీఏ అధికారుల ట్రయల్ రన్
Pawan Kalyan: వినాయకుడిపైనే ఆంక్షలా.. ఏపీ సర్కార్ తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్!