Uttar Pradesh: బోరుబావిలోంచి ఆరేళ్ల బాలుడి ఏడుపు శబ్దం… సురక్షితంగా బయటికి తీసిన రెస్క్యూ సిబ్బంది..

నోర్లు తెరిచిన బోరు బావులు పసిప్రాణాలను మింగేస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు..

Uttar Pradesh: బోరుబావిలోంచి ఆరేళ్ల బాలుడి ఏడుపు శబ్దం... సురక్షితంగా బయటికి తీసిన రెస్క్యూ సిబ్బంది..
Child Fell In Borewell

Edited By:

Updated on: Jan 10, 2023 | 7:02 PM

నోర్లు తెరిచిన బోరు బావులు పసిప్రాణాలను మింగేస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హాపూర్‌ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేండ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి తెరచివున్న బోరుబావిలో పడిపోయాడు. అయితే రెస్క్యూ టీమ్స్ సమయానికి స్పందించి.. రక్షణ చర్యలు చేపట్టడంతో.. బాలుడ్ని సురక్షితంగా ఆ 60 అడుగుల లోతైన బోరుబావి నుంచి బయటకు తీశారు.

స్థానికంగా నివసిస్తున్న ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ బావిలో పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే సమాచారాన్ని రెస్క్యూ టీమ్స్‌కు అందించారు. పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. బోరుబావిలో నుంచి బాలుడి ఏడుపు నిరంతరం వస్తూనే ఉంది. చాలా జాగ్రత్తగా రెస్క్యూ టీమ్స్ బాలుడ్ని కాపాడేందుకు శ్రమించింది. చివరికి క్షేమంగా బయటికి తీశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడికి స్వల్ప గాయాలు కాగా.. అతడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..