Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన 22 రోజులకే ఉచ్చుకు వేలాడిన వధూవరులు.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కొత్తగా పెళ్లైన జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరణించిన పియూష్, నిషా ఫరూఖాబాద్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఫిబ్రవరి 17న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ ఈ విషాదం చోటు చేసుకుంది.

పెళ్లైన 22 రోజులకే ఉచ్చుకు వేలాడిన వధూవరులు.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు!
Suicide[1]
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 12, 2025 | 10:51 AM

ఓ కొత్త జంట ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి నడుద్దామనుకున్న ఆ ప్రేమికులు ఏడడుగులు వేసిన రెండు వారాలకే అనంత లోకాలకు చేరారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో గుడిలో ఓకటయ్యారు. ఇంతలోనే ఒకే గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ విషాద ఘటన కలకలం రేపింది.

ఫరూఖాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఫిబ్రవరి 17న తన స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి కుటుంబాలు ఈ బంధానికి వ్యతిరేకించాయి. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తరువాత, వారిద్దరూ ఘజియాబాద్‌లోని కవినగర్‌కు వచ్చి అద్దె ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఇక్కడ ఏదో జరిగింది. వారిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారు రాసిన సూసైడ్ నోట్‌ చూసి, పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.

తమను ఎవరైనా పట్టుకుంటే, తమ కుటుంబ సభ్యులు తమను వేరు చేస్తారేమోనని భయపడుతున్నట్లు ఆ జంట సూసైడ్ నోట్‌లో రాశారు. ఇంట్లో నుంచి ఏదైనా దొంగిలించిన తర్వాత తాను పారిపోలేదని, ప్రేమించిన పారిపోయామని స్పష్టం చేశారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ అవుట్ పోస్ట్ పరిధిలోని మహేంద్ర ఎన్ క్లేవ్ లోని ఒక ఇంట్లో ఒక జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కవి నగర్ పోలీస్ స్టేషన్ కు 112 న సమాచారం అందిందని ACP స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న కవి నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా ఇల్లు తలుపు మూసి ఉందని గుర్తించారు. పోలీసు బృందం FSL బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించింది. దీని తరువాత, పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దీంతో ఓ జంట మృతదేహాలు ఉచ్చుకు వేలాడుతూ కనిపించాయి. సంఘటన స్థలాన్ని వీడియో తీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని , పంచనామా అనంతరం పోస్ట్ మార్టం కోసం పంపారు. సంఘటనా స్థలంలో సోదాలు జరుపుతున్న సమయంలో, పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభించింది. దానిపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్న క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..
గవర్నమెంట్ వాహనంలో బంగారం సరఫరా చేసిన రన్య రావు..
గవర్నమెంట్ వాహనంలో బంగారం సరఫరా చేసిన రన్య రావు..
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా..!
ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా..!
యూవీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్
యూవీకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రికెట్ గాడ్
కాల్ సెంటర్‎లో పని.. స్టార్ హీరోతో తొలి సినిమా.. ఎవరా బ్యూటీ.?
కాల్ సెంటర్‎లో పని.. స్టార్ హీరోతో తొలి సినిమా.. ఎవరా బ్యూటీ.?
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ అంతే..
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ అంతే..
ఇంట్లో శివలింగం ప్రతిష్టించానుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పని సరి
ఇంట్లో శివలింగం ప్రతిష్టించానుకుంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పని సరి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్
పీఎస్‌ఎల్ కంటే డబ్ల్యూపీఎల్ విజేతపైనే కోట్ల వర్షం.. ఎంత ఎక్కువంటే
పీఎస్‌ఎల్ కంటే డబ్ల్యూపీఎల్ విజేతపైనే కోట్ల వర్షం.. ఎంత ఎక్కువంటే