తమిళనాడులోనూ ఢిల్లీ తరహా లిక్కర్ స్కామ్.. ఈడీ సోదాల్లో తేలిందంటే..?
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం విక్రయాలకు సంబంధించి మద్యం సరఫరా చేస్తున్న డిస్టలరీస్ యజమానులు డిఎంకెలో కీలక నేతలుగా మాజీ మంత్రులుగా ఎంపీలుగా ఉన్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ధరలతో పోల్చితే నేరుగా షాపులకు మద్యం పంపించినట్లు ఈడీ గుర్తించింది.

గత రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం రాజకీయంగా ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందో చూశాం.. ఢిల్లీ సీఎం సహా పలువురు ఎంపీ, ఎమ్మెల్సీలు సైతం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైలులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనుమానంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ చేస్తున్న సోదాల్లో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ అమ్మకాలు, అధికారిక లెక్కల్లో చూపని విక్రయాలకు సంబంధించి వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
తమిళనాడులో గత 20 సంవత్సరాలుగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తున్నాయి. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(TASMAC) ద్వారా మద్యం షాపుల నిర్వహణ జరుగుతుంటాయి. గత కొన్ని ఏళ్లుగా తాస్మాక్ ఆధ్వర్యంలో జరిగే మద్యం క్రయ విక్రయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకులకు చెందిన డిస్టలరీస్ నుంచి షాపులకు మద్యం సరఫరా చేసి, వాటిని ప్రభుత్వ లెక్కల్లో చూపకుండా ఆ ఆదాయాన్ని డిస్టలరీస్ యజమానులు ప్రజాప్రతినిధులు అలాగే కొందరు అధికారులు కలిసి పంచుకుంటున్నట్టు అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల డీఎంకే కీలక నేత విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ టార్గెట్‌గా ఐటీ,ఈడీ సోదాలు జరిగాయి. సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవలే బాలాజీ బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. అయితే మరోసారి మార్చి 6వ తేదీ నుంచి తమిళనాడులో సెంథిల్ బాలాజీ, అలాగే మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ TASMAC కేంద్ర కార్యాలయంతో పాటు పలు డిస్టలరీస్ పైనా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని 40 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. అలాగే మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయన్న అనుమానానికి సంబంధించి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం విక్రయాలకు సంబంధించి మద్యం సరఫరా చేస్తున్న డిస్టలరీస్ యజమానులు డిఎంకెలో కీలక నేతలుగా మాజీ మంత్రులుగా ఎంపీలుగా ఉన్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ధరలతో పోల్చితే నేరుగా షాపులకు మద్యం పంపించినట్లు ఈడీ గుర్తించింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అధికారికంగా విక్రయించడం కంటే ఎక్కువగా ఉండడంతో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
#WATCH | Tamil Nadu: Raid by Enforcement Directorate (ED) underway at Tamil Nadu State Marketing Corporation Limited (TASMAC) office in Chennai
More details awaited pic.twitter.com/tmC4E2D086
— ANI (@ANI) March 6, 2025
ఇటీవల కాలంలో మద్యం అక్రమంగా విక్రయాల ద్వారా సుమారు 1000 కోట్ల రూపాయలు లంచంగా డిస్టలరీస్ వ్యాపారులు మొట్ట చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం ఎవరికీ చేరింది? ఇందులో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అన్న అంశంపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం అక్రమాలపై ఈడి మరింత లోతుగా విచారణ జరిపిన తర్వాత ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా అరెస్టలు తప్పవని రాజకీయంగా జరుగుతున్న చర్చ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..