నేడు ట్రంప్‌ ఎవరెవరితో భేటీ కాబోతున్నారంటే!

సోమవారం ట్రంప్ భారత్ పర్యటన ఎంతో బిజీబిజీగా గడిచింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మొదలు ఎటు చూసినా.. ట్రంప్, మోదీ చిత్రాటు, కటౌట్‌లు, బ్యాండ్ బాజాలు, లక్షలాది జనం, ముఖ్యంగా తాజ్ మహల్ పర్యటన ఇలా ట్రంప్ దంపతుల తొలిరోజు పర్యటన..

నేడు ట్రంప్‌ ఎవరెవరితో భేటీ కాబోతున్నారంటే!
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2020 | 10:00 AM

సోమవారం ట్రంప్ భారత్ పర్యటన ఎంతో బిజీబిజీగా గడిచింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మొదలు ఎటు చూసినా.. ట్రంప్, మోదీ చిత్రాటు, కటౌట్‌లు, బ్యాండ్ బాజాలు, లక్షలాది జనం, ముఖ్యంగా తాజ్ మహల్ పర్యటన ఇలా ట్రంప్ దంపతుల తొలిరోజు పర్యటనలో విశేషాలెన్నో జరిగాయి. తాజ్ సందర్శన తర్వాత ట్రంప్ ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి అక్కడే ఐటీసీ మౌర్య హోటల్లో బస చేశారు. కాగా రెండో రోజు ట్రంప్ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ట్రంప్ ఏ సమయంలో ఎక్కడ ఉంటారు? ఎక్కడకు వెళతారు? ఇలా ఫూర్తి షెడ్యూల్‌ని విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఉదయం 9.55కు ట్రంప్, మెలానియా కలిసి రాష్ట్రపతి భవన్‌కు వస్తారు. అనంతరం మోదీతో పాటు ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌లో ఇద్దరూ కలిసి గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత 11.25కి హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ పలువురు ప్రముఖులను కలుసుకోబోతున్నారు.

ఆ తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను ట్రంప్, మెలానియా సందర్శిస్తారు. తర్వాత ద్వైపాక్షిక సమావేశం జరుగనుంది. ఈ భేటీలో భారత దేశ రక్షణకు సంబంధించి మోదీ, ట్రంప్‌లు పలు కీలక చర్చలు చేసే అవకాశం ఉంది. ఇందులో భారత రక్షణ శాఖ అధికారులు పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అనంతరం లంచ్ చేసి ట్రంప్ యూఎస్ ఎంబసీ సిబ్బందితో భేటీ అవుతారు.

కాగా.. సాయంత్రం ట్రంప్ ఫ్యామిలీ రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ కోవింద్‌తో భేటీ అయి.. ఆయన ఇచ్చే విందులో పాల్గొంటారు. ఈ భేటీలో 8 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో పాటు, పలువురు వీఐపీలను కలవనున్నారు. అనంతరం రాత్రి 10 గంటలకు ట్రంప్ బృందం అమెరికాకు తిరుగు ప్రయాణమవుతుంది. ఇలా ట్రంప్ దంపతుల భారత్ పర్యటన ముగుస్తుంది.