AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్‌ న్యూస్: భారత్‌కు చేరుకున్న ట్రంప్.. మోదీ సాదర స్వాగతం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు భారతదేశానికి చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. కాగా దాదాపు భారత్‌లోరెండు రోజుల పర్యటన..

ఫ్లాష్‌ న్యూస్: భారత్‌కు చేరుకున్న ట్రంప్.. మోదీ సాదర స్వాగతం
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 24, 2020 | 12:37 PM

Share

Donald Trump India Visit:  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు భారతదేశానికి చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలతో ట్రంప్‌ని ఆహ్వానించారు మోదీ. భారత్‌లో దాదాపు రెండు రోజుల పర్యటన చేయనున్నారు ట్రంప్. కాగా మొదట సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలను తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు. కాగా.. అక్కడి నుంచి మోతేరా స్టేడియానికి 22 కిలోమీటర్ల రోడ్ షో ర్యాలీలో పాల్గొననున్నారు. దాదాపు 35 నిమిషాల పాటు ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో అడుగడుగునా స్వాగతం పలికేలా హోర్డింగులు, ప్లకార్డులు, స్టేజీలపై నృత్యాలను అరేంజ్ చేశారు అధికారులు.

మధ్యాహ్నం 12.30కి స్టేడియం ప్రారంభం తర్వాత నమస్తే ట్రంప్ కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రజలనుద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.అక్కడి నుంచి 3.30కి మిస్టర్ అండ్ మిసెస్ ట్రంప్ ఆగ్రాకు బయల్దేరతారు. సాయంత్రం 4.45కు ఆగ్రాకు చేరుకుని తాజ్‌మహల్‌ని సందర్శిస్తారు. తిరిగి అక్కడి నుంచి ఇద్దరూ 6.45కి బయల్దేరుతారు. రాత్రి 7.30కి ఢిల్లీ పాలం ఎయిర్ పోర్టుకు చేరుకొని.. రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు.

మరుసటి రోజు ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 9.55కు ట్రంప్ మెలానియా కలిసి రాష్ట్రపతి భవన్‌కు వస్తారు. 10.45కు రాజ్‌ఘాట్‌లో ఇద్దరూ కలిసి గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత 11.25కి హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను ట్రంప్ మెలానియా సందర్శిస్తారు. తర్వాత ద్వైపాక్షిక సమావేశం జరుకానుంది. మోదీ-ట్రంప్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే లంచ్ కార్యక్రమం ఉంటుంది.

మధ్యాహ్న భోజనం తర్వాత 2.55కి ట్రంప్ యూఎస్ ఎంబసీకి వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఎంబసీ సిబ్బందితో భేటీ అవుతారు. సాయత్రం 5 గంటలకు తిరిగి ఆయన హోటల్ మౌర్యాకు వస్తారు. ఆరోజు రాత్రి 7.25 ట్రంప్- మెలానియా కలిసి రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ కోవింద్‌తో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు ట్రంప్ దంపతులకు ప్రెసిడెంట్ ఇచ్చే డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. అనంతరం రాత్రి 10 గంటలకు ట్రంప్ బృందం అమెరికాకు తిరుగు ప్రయాణమవుతుంది. ఇలా ట్రంప్ దంపతుల భారత్ పర్యటన ముగుస్తుంది.

Follow Us
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే