AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా నుంచి మరోసారి భారత్‌-పాక్‌ సీజ్‌ఫైర్‌ మాట! ఎంత చెప్పినా వీళ్లు మారరా?

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని, అధ్యక్షుడు ట్రంప్ శాంతియుత పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్‌ పై దాడి ఆపిన తర్వాత కూడా అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అమెరికా నుంచి మరోసారి భారత్‌-పాక్‌ సీజ్‌ఫైర్‌ మాట! ఎంత చెప్పినా వీళ్లు మారరా?
Trump And Pakistan
SN Pasha
|

Updated on: Aug 08, 2025 | 7:29 PM

Share

భారత్‌, పాకిస్తాన్ యుద్ధం సమయంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని అని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంధికి మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేశారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. మే 10 నుండి ట్రంప్ లేదా అతని అధికారులు వాణిజ్య ఒప్పందాలపై భారత్‌, పాకిస్తాన్‌లను బెదిరించడం ద్వారా శాంతిని నెలకొల్పడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని పదే పదే పేర్కొన్నారు. భారత్‌, పాకిస్తాన్ యుద్ధానికి దిగినప్పుడు మేం ప్రత్యక్షంగా పాల్గొన్నాం. అధ్యక్షుడు ట్రంప్‌ శాంతిని సాధించగలిగారు అని గురువారం రూబియో తెలిపారు. ట్రంప్‌ను శాంతి అధ్యక్షుడు అని అభివర్ణిస్తూ, ట్రంప్‌ శాంతికి కట్టుబడి ఉన్నారని అన్నారు.

కంబోడియా-థాయిలాండ్ శాంతిలో ట్రంప్ పాత్ర కీలకమని రూబియో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రధాన ఘర్షణల సమయంలో, ముఖ్యంగా కంబోడియా, థాయిలాండ్ మధ్య అశాంతి సమయంలో శాంతిని నిర్ధారించడంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రను మార్కో రూబియో కూడా గుర్తించారు. జూలై 24న కంబోడియా, థాయిలాండ్ మధ్య టాముయెన్ థామ్ ఆలయం, సురిన్, ఉబోన్, రాట్చథానితో సహా చుట్టుపక్కల ప్రాంతాల సమీపంలోని వారి దీర్ఘకాల వివాదాస్పద సరిహద్దులో భారీ అశాంతి చెలరేగింది. ల్యాండ్‌మైన్ పేలిన తర్వాత వివాదం ప్రారంభమైంది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌, పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని ముగించాలన్న అమెరికా అధ్యక్షుడి వాదనను భారత్‌ పదే పదే తిప్పికొట్టింది. రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) ప్రత్యక్ష సంభాషణ తర్వాత పాకిస్తాన్‌పై కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నామని, చర్చలలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్‌ వాదిస్తోంది. అయినా కూడా అమెరికా నుంచి మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి