Zika Virus: ఒక్క రోజే మరో 30 జికా వైరస్ కేసులు నిర్ధారణ.. ఆ నగరంలో హై అలెర్ట్.. భయంతో హడలెత్తిపోతున్న జనం

Zika Virus News: జికా వైరస్.. ఇప్పుడు కరోనా వైరస్‌తో పాటు దేశంలోని కొన్ని నగరాలను హడలెత్తిస్తున్న మరో ప్రాణాంతక వైరస్.

Zika Virus: ఒక్క రోజే మరో 30 జికా వైరస్ కేసులు నిర్ధారణ.. ఆ నగరంలో హై అలెర్ట్.. భయంతో హడలెత్తిపోతున్న జనం
Zika Virus
Follow us

|

Updated on: Nov 05, 2021 | 10:37 AM

Zika Virus in Kanpur: జికా వైరస్.. ఇప్పుడు కరోనా వైరస్‌తో పాటు దేశంలోని కొన్ని నగరాలను హడలెత్తిస్తున్న మరో ప్రాణాంతక వైరస్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కేసులు హడలెత్తిస్తున్నాయి. గురువారంనాడు మరో 30 జికా వైరస్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు కాన్నూర్ నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేపల్ సింగ్ వెల్లడించారు. దీంతో అక్కడ ఇప్పటి వరకు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 66కు చేరుకుంది. మునుపటి రోజు(బుధవారం) కాన్పూర్‌లో 25 జికా వైరస్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. వీరిలో ఆరుగురు భారత వైమానిక దళ(IAF) సిబ్బంది సైతం ఉన్నారు. జికా వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కాన్పూర్‌లో హై అలెర్ట్ కొనసాగుతోంది.

జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌తో పాటు అనుమానిత రోగులను గుర్తించే పనిలో వైద్య బృందాలు నిమగ్నమయ్యాయి. జికా వైరస్ బారినపడి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోగులు, గర్భిణి మహిళలను గుర్తించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి కోసం ఇంటింటికి వెళ్లి ఎవరైనా బాధితులు ఉన్నారేమో అడిగి తెలుసుకుంటున్నారు.

జికా వైరస్ ఇన్ఫెక్షన్ అయిన దోమ కరవడం ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. అపరిశుభ్రత కారణంగా ఈ వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో అంటువ్యాధులు నివారణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను గత వారం ఆదేశించారు. అలాగే ప్రజలు జికా వైరస్ బారినపడకుండా.. యాంటి లార్వా స్ట్రేయింగ్ వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించిన యూపీ సర్కారుకు.. ఇప్పుడు జికా వైరస్ విజృంభనను కట్టడి చేయడం సవాలుగా మారింది.

Also Read..

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం..

Sunny Leone: సరికొత్త వ్యాపారంలోకి సన్నీలియోన్‌.. ఈ బిజినెస్‌ చేస్తున్న మొదటి భారతీయ నటి ఆమెనే..