ప్రియుడితో భార్యను సాగనంపిన భర్త.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!
మానవ సంబంధాలు రోజు రోజుకీ ఎంతగా దిగజారిపోతున్నాయో ఈ ఉదంతమే నిదర్శనం. దాదాపు జీవిత చరమాంకానికి వచ్చిన నలుగురు పిల్లల తల్లి.. తనకంటే 15 ఏళ్లు చిన్నవాడితో ప్రేమకలాపం నడిపింది. అంతేనా అతడితో పారిపోయి కోర్టులో పెళ్లి కూడా చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చిన ఆమె మొదటి భర్త కాళ్లపై పడి క్షమాపణలు కోరింది. అతడు క్షమించాడు. భర్త పిల్లలతో కొన్నాళ్లు సక్రమంగానే ఉన్న ఆమె మళ్లీ పాత ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో విసిగి పోయిన భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు..

రాయచూర్, జులై 23: ఉత్తరప్రదేశ్‌లో సిద్ధార్థనగర్ జిల్లాలోని భవానీగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భార్య తన నలుగురు పిల్లలను వదిలి తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన తన ప్రేమికుడితో వెళ్లిపోయింది. అదీ.. ఆమె భర్త స్వయంగా దగ్గరుండి ఆమెను ప్రియుడితో సాగనంపాడు. రామ్‌చరణ్ (47) అనే వ్యక్తి దాదాపు 20 యేళ్ల క్రితం జానకీ దేవి (40)ని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇంటి ఖర్చులు పెరగడంతో రామ్‌చరణ్ ముంబైకి వెళ్లి టైల్స్ అమర్చే పని చేయడం ప్రారంభించాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో సదరు మహిళ పొరుగు గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సోను ప్రజాపతితో స్నేహం చేసింది. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పారిపోయి ఏడాది క్రితం కోర్టులో వివాహం చేసుకున్నారు. దాదాపు 5-6 నెలలు కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆ పెళ్లి పెటాకులైంది. తప్పుతెలుసుకున్న భార్య.. తన భర్తను వెతుక్కుంటూ ఇంటికి చేరింది.
తనను క్షమించాలని భర్త రామ్ చరణ్ కాళ్లపై పడి కోరింది. తన వద్దనే ఉంటానని భర్తను వేడుకుంది. దీంతో కరిగిపోయిన రామ్ చరణ్ ఆమెను క్షమించి ఇంట్లోకి చేరదీశాడు. కొన్ని నెలలు సజావుగానే ఉన్న ఆమె.. ఉన్నట్టుండి మళ్లీ తన పాత ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో రాం చరణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సోనూ తన భార్యను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని ఆరోపించాడు. జులై 20న ఇరువర్గాలను పిలిచి పోలీసులు పంచాయితీ పెట్టారు.
తన భార్య జానకి ఇకపై తన ప్రియుడు సోనూతోనే ఉంటుందని, తనకు ఎలాంటి సంబంధం ఉండదని ఓ కాగితంపై రాసి రాంచరణ్ సంతకం పెట్టాడు. నలుగురు పిల్లలు తన వద్దే ఉంటారని, జానకి మాత్రం ప్రియుడితో ఉంటుందని అందులో రాంచరణ్ తెలిపాడు. గతంలో కూడా ఆమె వెళ్లిపోయి తిరిగొచ్చింది. ఆమెను క్షమించమని కోరగా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆమె తిరిగి వచ్చినా కలిసి జీవించలేను. ఆమె తనకు, తన పిల్లలకు హాని తలపెడుతుందేమోనని భయంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. నా నలుగురు పిల్లలు నాతోనే ఉంటారని పోలీసులకు తెలిపాడు. ఇక జానికి కూడా నాలుగేళ్ల నుంచి సోనూతో పరిచయం ఉందని, చివరి వారకు అతనితోనే ఉంటానని తెలిపింది. మొదటి సారి వెళ్లిపోయినప్పుడు పిల్లలు గుర్తుకువచ్చి తిరిగొచ్చినని, కానీ ఇప్పుడు సోనూతోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. తామిద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. పిల్లలు వారి తండ్రితోనే ఉంటారని ఉంటారని, తాను అందుకు అంగీకరిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. పోలీస్ స్టేషన్‌లో ఇరువురికి రాజీ కుదిర్చినట్లు భవానీగంజ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ హరియోమ్ కుష్వాహా మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




