AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి సార్‌.. ఏకంగా ఉన్నతాధికారులపైనే విరుచుకుపడిన హెడ్‌మాస్టర్‌

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని మహముదాబాద్ ప్రాంతంలోని షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ ఆస్కూల్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ టీచర్‌ను వేధిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఈ విచారణ సందర్భంగా సహనం కోల్పోయిన హెడ్‌మాస్టర్‌ ప్రాథమిక విద్యా అధికారిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Video: మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి సార్‌.. ఏకంగా ఉన్నతాధికారులపైనే విరుచుకుపడిన హెడ్‌మాస్టర్‌
Viral Video
Anand T
|

Updated on: Sep 24, 2025 | 4:39 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని మహముదాబాద్ ప్రాంతంలోని నద్వాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విచారణ సందర్భంగా ప్రాథమిక విద్యా అధికారి (BEO)పై దాడి చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సెప్టెంబర్ 23న తన పాఠశాల సిబ్బంది ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న సమయంలో బ్రిజేంద్ర వర్మ అనే స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ తన కార్యాలయంలో తనపై దాడి చేశాడని BEO అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో హెడ్‌మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నద్వాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో బ్రిజేంద్ర వర్మ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అదే పాఠశాలకు చెందిన అసిస్టెంట్ టీచర్‌ను వర్మ కొద్దిరోజులుగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో. ప్రాథమిక విద్యా అధికారి సింగ్ వర్మతో పాటు సదురు అసిస్టెంట్‌ టీచర్‌ను విచారణకు పిలిచారు. విచారణ సమయంలో ప్రధానోపాధ్యాయు వర్మకు వ్యతిరేకంగా అక్కడున్న ప్రతి ఒక్కరూ మాట్లాడారు.. అతనిదే తప్పు అని ఎత్తిచూపారు. దీంతో కోపోద్రుక్తుడైన వర్మ తన బెల్ట్ తీసి, అక్కడున్న అధికారిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న CCTVలో రికార్డైంది.

సీసీటీవీ వీడియో ప్రకారం.. వర్మ డెస్క్‌పై ఉన్న ఫైల్‌ను తీసుకొని అక్కడున్న వారిపై దాడి చేయడం చూడవచ్చు. అడ్డుకోవడానికి వచ్చిన సిబ్బందిపై కూడా అతని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వర్మను అరెస్ట్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..