Viral: ఐదేళ్ల చిన్నారికి అనారోగ్య సమస్యలు.. ఆస్పత్రిలో స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్

నలుగురు వైద్యుల బృందం ఆ చిన్నారికి 4 గంటలపాటు శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. ఆపరేషన్ అనంతరం చిన్నారి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంతకీ ఆ బాలడి సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి...

Viral: ఐదేళ్ల చిన్నారికి అనారోగ్య సమస్యలు.. ఆస్పత్రిలో స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్
CT Scan (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2023 | 1:33 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ డాక్టర్లు రేర్ సర్జరీ చేసి.. ఔరా అనిపించారు. 5 ఏళ్ల చిన్నోడి ఉదరం నుంచి ఏకంగా 12 కిలోల బరువున్న కణితిని తొలిగించారు. దీంతో ఆ బడ్డోడి కుటుంబ సభ్యులు డాక్టర్లలకు వేల వేల వందనాలు చెబుతున్నారు. తమ బిడ్డను కాపాడిన డాక్టర్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బులంద్​షహర్​ ఐదేళ్ల వయస్సున్న చిన్నోడికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఉదర భాగం ఉబ్బుతున్నట్లు అనిపించడంతో.. అలీగఢ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు స్టన్ అయ్యారు. కడుపులో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితిని మెడికల్ టెర్మినాలజీలో సిస్టిక్ టెరాటోమా అంటారు. పుట్టుకతో వచ్చే సిస్టిక్ టెరాటోమా ఏజ్ పెరుగుతున్నకొద్ది పెరిగుతుందని.. దీని వల్ల ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చని డాక్టర్లు తెలిపారు.

బాలుడికి పుట్టినప్పటి నుంచి కడుపులో కణితి ఉందని.. ఆ విషయం కుటుంబ సభ్యులకు గుర్తించలేదని ఆపరేషన్ చేసిన వైద్యులు తెలిపారు. వయసుతో పాటు కణితి  పెద్దదిగా మారి అనారోగ్యానికి దారితీసిందని వివరించారు. డాక్టర్ సంజయ్ భార్గవ నేతృత్వంలో నలుగురు వైద్యుల టీమ్ ఆ చిన్నారికి 4 గంటలపాటు శ్రమించి సక్సెస్‌ఫుల్ సర్జరీ పూర్తి చేసింది. ఆపరేషన్ తర్వాత చిన్నారి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కానీ తోపల కణితి ఇంత బరువు ఉంటుందని తాము కూడా ఊహించలేదన్నారు.

Rare Surgery

Rare Surgery to boy

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..