AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax on Luxury Buses: లగ్జరీ బస్సులపై ఏడాదికి రూ. 9 లక్షల పన్ను.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

లగ్జరీ బస్సులపై ఏడాదికి రూ.9 లక్షల వరకు పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల మంచి ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు పన్ను చెల్లించకుండానే లగ్జరీ బస్సులు రోడ్లపై తిరిగేవని, ఇకపై పన్ను చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Tax on Luxury Buses: లగ్జరీ బస్సులపై ఏడాదికి రూ. 9 లక్షల పన్ను.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Luxury Buses
Subhash Goud
|

Updated on: May 19, 2023 | 2:40 PM

Share

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు లగ్జరీ బస్సులపై పన్ను విధించాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు పన్ను చెల్లించకుండానే లగ్జరీ బస్సులు రోడ్లపై తిరిగేవని, ఇకపై పన్ను చెల్లించాల్సిందేనని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ పన్ను మొత్తం ఏటా రూ.9 లక్షలు అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు రాష్ట్రంలో తిరిగే లగ్జరీ బస్సులపై సంవత్సరానికి రూ.9 లక్షల పన్ను విధించబడుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 నుంచి 250 లగ్జరీ బస్సులు పన్ను చెల్లించకుండా తిరుగుతుండడం గమనార్హం.

ఆదాయాన్ని పెంచుకోవడానికి పెద్ద ఎత్తుగడ:

ప్రస్తుతం రూ.1,355 కోట్ల భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్న హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హెచ్‌ఆర్‌టీసీ నెలవారీ ఆదాయం రూ.65 కోట్లు కాగా, ఖర్చు రూ.134 కోట్లు అని ముఖేష్ అగ్నిహోత్రి తెలిపారు. అంటే 69 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది.

ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లో జాప్యం:

ఈ భారీ నష్టం కారణంగా ఉద్యోగుల జీతం, పెన్షన్‌లో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతినెలా 7వ తేదీలోగా జీతాలు అందజేస్తామని హెచ్‌ఆర్‌టీసీ ఉద్యోగులకు ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో తక్కువ మంది ప్రయాణికులతో మారుమూల ప్రాంతాలలో బస్సులను నడపడంతో పాటు మహిళలు, పిల్లలకు రాయితీపై ప్రయాణాన్ని అందించడం వల్ల హెచ్‌ఆర్‌టీసీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

600 బస్సుల కొనుగోలు లక్ష్యం:

ప్రస్తుతం రాష్ట్రంలో 3,719 రూట్లలో 3,142 బస్సులను నడుపుతోంది. వాటిలో 167 బస్సులు 15 సంవత్సరాల కిందటివి. వాటిని భర్తీ చేయాల్సి ఉంది. 202 బస్సులను తక్షణమే మార్చాలని యోచించారు. మొత్తం 369 బస్సులను మార్చాలని నిర్ణయించారు. దీనితో HRTC ఫ్లీట్ 2,773 కు తగ్గించబడింది. 2023లో ఎలక్ట్రికల్ బస్సులతో సహా 600 బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ఎలక్ట్రిక్ బస్సులపై ఎక్కువ దృష్టి పెట్టారు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి