AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..

"అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత, 42వ సవరణ తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇది రాజ్యాంగంలోని 32 నిబంధనలను మార్చిందన్నారు. అలాగే రాజ్యాంగంలో యాభై శాతం మార్చారన్న ఆయన, నేడు కొంతమంది రాజ్యాంగాన్ని బహిరంగంగా చూపిస్తున్నారు, వారు కనీసం దానిపై పశ్చాత్తాపం కానీ, విచారం వ్యక్తం చేయడం లేదన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..
Union Minister Prahlad Joshi
Balaraju Goud
|

Updated on: Jun 29, 2025 | 5:00 PM

Share

“అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత, 42వ సవరణ తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇది రాజ్యాంగంలోని 32 నిబంధనలను మార్చిందన్నారు. అలాగే రాజ్యాంగంలో యాభై శాతం మార్చారన్న ఆయన, నేడు కొంతమంది రాజ్యాంగాన్ని బహిరంగంగా చూపిస్తున్నారు, వారు కనీసం దానిపై పశ్చాత్తాపం కానీ, విచారం వ్యక్తం చేయడం లేదన్నారు.

సోషలిస్ట్, లౌకిక అనే పదాలను అసలు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తిరస్కరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేరళ తిరువనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాము అని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను చేర్చడాన్ని పునఃపరిశీలించాలని RSS ప్రధాన కార్యదర్శి హోసబాలే సూచించిన తర్వాత ప్రహ్లాద్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబం నడుపుతున్న పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుండటం చాలా విడ్డూరం అని అన్నారు. 1975లో, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ కాలంలో, ప్రాథమిక హక్కులు నిలిపివేశారు. పౌరుల స్వేచ్ఛను హరించారు అని ప్రహ్లాద్ జోషి విమర్శించారు.

వీడియో చూడండి.. 

ఇదిలావుంటే, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద), అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన అత్యవసర పరిస్థితి 50వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హోసబాలే ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితి కేవలం అధికార దుర్వినియోగం మాత్రమే కాదని, పౌర స్వేచ్ఛలను అణిచివేసే ప్రయత్నం అని ఆయన అన్నారు. లక్షలాది మందిని జైలులో పెట్టారు, పత్రికా స్వేచ్ఛను అణచివేశారని గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో, “సోషలిస్ట్”, “లౌకిక” వంటి పదాలను రాజ్యాంగంలో బలవంతంగా చేర్చారని – దీనిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..