రాహుల్ గాంధీతో చర్చలపై స్పందించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
నీట్ అంశంపై జరిగిన ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ తన డిమాండ్లను మార్చారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ యువత నిరసనకు దిగితే వారిపై లాఠీచార్జ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. వారితో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపి, నిరసన విరమించే ప్రయత్నం చేశారు. ఈ చర్చల తర్వాత కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదిక స్పందించారు.
జితేంద్ర సింగ్ ప్రకారం.. ఆ ప్రాంతం నిరసనలకు అనువైన ప్రదేశం కాదని, ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని రాహుల్ గాంధీకి వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నీట్ అంశం, సంబంధిత సమస్యలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే ధర్నా విరమిస్తానని రాహుల్ గాంధీ తొలుత చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత నాయకత్వంతో చర్చించిన అనంతరం నీట్ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని రాహుల్ గాంధీకి తెలియజేశామని జితేంద్ర సింగ్ తెలిపారు.
అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ రాహుల్ గాంధీ ముందుకు తెచ్చారని ఆరోపించారు. దీనితో ఆయన తన డిమాండ్లపై మాట మార్చారంటూ జితేంద్ర సింగ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మాట ఇచ్చిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం సరైన విధానం కాదని జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. నీట్ అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారిక చర్చ కోసం ఇప్పటివరకు నోటీసు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
कुछ समय पहले, यह ज्ञात हुआ कि कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष, श्री मल्लिकार्जुन खड़गे और उनके साथ अन्य वरिष्ठ नेता, जैसे कि श्री राहुल गांधी, श्रीमती प्रियंका गांधी इत्यादि अकस्मात ही अकबर रोड़ के समीप एक स्थान पर अपने समर्थकों के साथ धरने पर बैठ गयेहैं। सरकार ने इस वरिष्ठ…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 21, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
