AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో రక్తపు మడుగులో ఆర్‌టీవో ఇన్‌స్పెక్టర్.. బయట చెట్టుకు ప్రియుడి శవం..!

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దతియాలో పనిచేస్తున్న ఆర్‌టీవో ఇన్‌స్పెక్టర్‌ మీనాక్షి గోఖలే దారుణహత్య కలకలం రేపింది. ఖజూరి సడక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లేక్‌ పెర్ల్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఆమె మృతదేహం సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం రక్తపు మడుగులో కనిపించింది. తలపై తీవ్ర గాయాలు ఉండగా, సమీపంలో రక్తపు మరకలున్న సుత్తిని పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా సుత్తితో దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంట్లో రక్తపు మడుగులో ఆర్‌టీవో ఇన్‌స్పెక్టర్.. బయట చెట్టుకు ప్రియుడి శవం..!
Rto Inspector
Balaraju Goud
|

Updated on: Sep 21, 2026 | 4:46 PM

Share

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దతియాలో పనిచేస్తున్న ఆర్‌టీవో ఇన్‌స్పెక్టర్‌ మీనాక్షి గోఖలే దారుణహత్య కలకలం రేపింది. ఖజూరి సడక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లేక్‌ పెర్ల్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఆమె మృతదేహం సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం రక్తపు మడుగులో కనిపించింది. తలపై తీవ్ర గాయాలు ఉండగా, సమీపంలో రక్తపు మరకలున్న సుత్తిని పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా సుత్తితో దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మీనాక్షి ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటలకు తన స్నేహితురాలు కృతిక, మూడేళ్ల కుమార్తెతో కలిసి పావన్‌ కుమార్‌ ద్వివేది ఇంటికి వెళ్లారు. రాత్రి కృతిక, చిన్నారి లోపలి గదిలో నిద్రించగా.. మీనాక్షి బయట గదిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం కృతిక నిద్రలేచి బయటకు వచ్చేసరికి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఈ ఘటన తర్వాత ఇంటికి సుమారు 20 మీటర్ల దూరంలోని చెట్టుకు పావన్‌ మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతని వద్ద బ్యాంక్‌ పాస్‌బుక్‌ లభించినట్లు పోలీసులు తెలిపారు. మీనాక్షిని హత్య చేసిన అనంతరం పావన్‌ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన క్రమాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో వివాహం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన్నట్లు వెల్లడైంది. పావన్‌ మీనాక్షిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడని, ఆమె మాత్రం అందుకు సిద్ధంగా లేరని అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఈ విషయంపై వాగ్వాదం జరిగి ఉండొచ్చని, ఆ తర్వాతే దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇంకా దర్యాప్తులో ఉన్న కోణమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

మీనాక్షి, పావన్‌ ఇండోర్‌లో పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు. పావన్‌ సిధి జిల్లాకు చెందినవాడు కాగా, ఇండోర్‌లో కోచింగ్‌ తరగతులు నిర్వహించేవాడని సమాచారం. మృతురాలు గతంలో వివాహం చేసుకుని, సుమారు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మీనాక్షి పావన్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకొందామని పావన్.. మీనాక్షిపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (FSL) బృందం కూడా కీలక ఆధారాలను సేకరించింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు ఫోరెన్సిక్‌ నివేదికలు వచ్చిన తర్వాతే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఘటనల క్రమాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us