Union Cabinet: రైతులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎరువులపై భారీగా రాయితీ..

రైతులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో ఎరువుల పై రాయితీని కేంద్రమంత్రిమండలి ఆమోదించింది. ఈ కాలానికి గానూ మొత్తం రూ.51,875 కోట్ల రూపాయల

Union Cabinet: రైతులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎరువులపై భారీగా రాయితీ..
Modi Cabinet Decisions
Follow us

|

Updated on: Nov 02, 2022 | 4:55 PM

రైతులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో ఎరువుల పై రాయితీని కేంద్రమంత్రిమండలి ఆమోదించింది. ఈ కాలానికి గానూ మొత్తం రూ.51,875 కోట్ల రూపాయల రాయితీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నవంబర్ రెండో తేదీ బుధవారం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నత్రజని (ఎన్), భాస్వరం (పి), పొటాష్ (కె), సల్ఫర్ (ఎస్) వంటి ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) కోసం కేంద్ర ఎరువుల శాఖ ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించడంతో రైతులకు రూ.51,875 కోట్ల ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడంలో భాగంగాకేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 2022-2023 రబీ సీజన్ కు గానూ అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల వద్ద రాయితీతో కూడిన ఎరువులు లభించనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది దీనిలో భాగంగానే ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, ఫాస్పటిక్‌, పొటాసిక్‌ ఎరువులపై రూ. 51,875 కోట్ల రాయితీని అందించనున్నట్లు తెలిపింది. కేంద్రమంత్రి మండలి తాజా నిర్ణయంతో రైతులకు నోటిఫై చేసిన ఫాస్పటిక్‌, పొటాసిక్‌ ఎరువులు అందుబాటు ధరల్లో లభించనున్నాయి.

పోషకాధారిత రాయితీ (న్యూట్రియంట్‌ బేస్డ్‌ సబ్సిడీ) రూపంలో రైతులకు ఈ ఎరువులను సరఫరా చేస్తారు. దీనివల్ల రైతులందరికీ అవసరమైన ఎరువులు ఇబ్బందుల్లేకుండా అందుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమోదిత ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు రాయితీ మొత్తం విడుదల అవుతుందని, వారు రైతులకు అందుబాటు ధరలో ఎరువులను సరఫరా చేస్తారని కేంద్రప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..