Shiv Sena: షిండే వర్సెస్ ఉద్ధవ్.. శివసేన సింబల్‌ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..

ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించి దానికి 'విల్లు - బాణం' ఎన్నికల గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Shiv Sena: షిండే వర్సెస్ ఉద్ధవ్.. శివసేన సింబల్‌ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..
Shinde Faction To Get Shiv Sena Name, Bow Arrow Symbol

Updated on: Feb 20, 2023 | 2:54 PM

ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించి దానికి ‘విల్లు – బాణం’ ఎన్నికల గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. కాగా.. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవే ఠాక్రే వర్గం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, శివసేన సింబల్‌ వివాదంపై ఉద్దవ్‌థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ వ్యవహారంపై ఇవాళ అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. రేపు ఈ విషయాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా కార్యాలయాన్ని షిండే వర్గం తన ఆధీనంలోకి తీసుకుంది. అంతకుముందు శివసేన (షిండే వర్గం) చీఫ్ విప్ భరత్ గోగవాలే ఇతర ఎమ్మెల్యేలతో కలిసి విధాన్ భవన్ చేరుకుని.. విధాన్ భవన్‌లోని శివసేన శాసనసభా పక్ష కార్యాలయాన్ని అప్పగించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను కలిశారు. కాగా, శివసేన పార్టీ పేరును, గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై ఉద్దవ్‌ వర్గం మండిపడుతోంది.

ఇవి కూడా చదవండి

శివసేన సింబల్‌ను కొనడానికి షిండే వర్గం రూ. 2000 కోట్లు ఖర్చు చేసిందన్న ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు ఎంపీ సంజయ్‌ రౌత్‌. దీనికి సంబంధించి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, తగిన సమయంలో వాటిని బయటపెడతానని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..