సీఎంగా షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవకముందే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. పవార్ ఎన్నికల అఫిడివిట్లో పొందుపర్చిన ఆస్తులు, ఆదాయంపై ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. శరద్ పవార్‌కు నోటీసుల జారీ..
ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో తామంతా భావోద్వేగానికి గురయ్యామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై అందరికీ నమ్మకం ఉంది. అన్ని కులాలు, మతాల వారు ఆయనకు మద్దతు పలుకుతున్నారన్నారు.
శివసేన నేత ఏక్నాథ్ శిండే వర్గీయులు తిరుగుబాటుతో అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోయింది. కాగా.. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.
మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది.
ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకునేందుకు రేపు బలపరీక్ష నిర్వహించాలని బుధవారం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ సూచించారు.
Eknath Shinde: రెబల్ ఎమ్మెల్యేలతో చర్చల తరువాత హోటల్ బయటకు వచ్చారు షిండే. రాజకీయ సంక్షోభం తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు షిండే. తమదే అసలైన శివసేన అన్నారు షిండే.
భారతీయ జనతా పార్టీ (BJP) హైకమాండ్ పిలుపుతో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు.
సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దొరకడంతో మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఇవాళ గవర్నర్‌ను కలిసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరనుంది.
Maharashtra Political Crisis Updates: ఏక్నాథ్ శిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఏక్నాథ్ శిండేతో పాటు మిగిలిన రెబెల్ ఎమ్మెల్యేలపై బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం (PIL) దాఖలయ్యింది.
Maharashtra Political Crisis: శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్శిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు.. డిప్యూటీ స్పీకర్అనర్హత నోటీసులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. శివసేన శాసనసభా పక్ష నేతగా తనను తొలగిస్తూ.. అజయ్ ఛౌదరిని నియమించడాన్ని కూడా సవాల్ చేశారు శిండే.