Udaipur Murder Case: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో దారుణం.. నూపుర్‌శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తి దారుణ హత్య ..

Udaipur Tailor Murder Case: స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణహత్య తీవ్ర సంచలనం రేపింది. ఇద్దరు వ్యక్తులు టైలర్‌ దుకాణం లోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Udaipur Murder Case: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో దారుణం.. నూపుర్‌శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తి దారుణ హత్య ..
Udaipur Tailor Murder Case
Sanjay Kasula

|

Jun 28, 2022 | 7:39 PM

నూపుర్‌శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణహత్య తీవ్ర సంచలనం రేపింది. ఇద్దరు వ్యక్తులు టైలర్‌ దుకాణం లోకి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కొలతలు తీసుకుంటున్న టైలర్‌ను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తరువాత ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హంతకులకు కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తూ ర్యాలీ తీశారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు హంతకులు ఈ మర్డర్‌ తరువాత వీడియో కూడా రిలీజ్‌ చేశారు. బట్టలు కుట్టించుకుంటాననే నెపంతో హంతకులు అతని దుకాణానికి వచ్చి హత్య చేశారు. అంతేకాదు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

రెండవ వీడియోలో, ఇద్దరు తమను మొహమ్మద్ రియాజ్, అతని స్నేహితుడిగా చెప్పుకున్నారు. “తల నరికివేయడం” గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత వారు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి “హెచ్చరిక” జారీ చేసినట్లు తెలుస్తోంది.

గౌస్‌ మహ్మద్‌ , మహ్మద్‌ రియాజ్‌ అనే వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన తరువాత రాజస్థాన్‌లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉదయ్‌పూర్‌లో దుకాణాలను మూసేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతిభద్రతలను కాపాడాలని సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు.

నిందితులకు శిక్ష పడుతుంది- సీఎం గెహ్లాట్ 

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. “ఉదయ్‌పూర్‌లో యువకుడి దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ఈ సంఘటనలో పాల్గొన్న నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటాము. నేను అన్ని వైపుల నుండి శాంతిని కాపాడుతాను.” ఈ దారుణ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా హత్యకు సంబంధించిన వీడియోను షేర్ చేయవద్దని సీఎం గెహ్లాట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించవద్దని అందరికి విజ్ఞప్తి చేశారు. వీడియోను షేర్ చేయడం ద్వారా సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే నేరగాళ్ల ఉద్దేశం సఫలీకృతం అవుతుందన్నారు.

ఈ విషయంపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ.. ఉదయ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దీని వెనుక ఓ ముఠా ఉంది. సీఎంతో మాట్లాడాను. ఇలాంటి వారికి కఠిన శిక్ష పడాలి. తాను ఎస్పీ, కలెక్టర్‌తో పాటు అక్కడి ప్రజలతో కూడా మాట్లాడినట్లుగా కటారియా వెళ్లడించారు.

అక్కడికక్కడే మోహరించిన పోలీసు బలగాలు 

ఎస్పీ ఉదయపూర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. దారుణ హత్య గురించి మాకు సమాచారం అందిన వెంటనే.. పోలీసులను మోహరించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది నిందితులను గుర్తించారు. మేము బృందాలను పంపాము. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మనం కూడా చూశాం.

జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu