AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే-ఇ-మహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపోరా థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. వారిపైకి టెర్రిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో కాల్పులను తిప్పికొట్టింది భారత ఆర్మీ. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులిద్దరూ కశ్మీర్‌కు చెందినవారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఆక్రమిత […]

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2020 | 4:29 PM

Share

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే-ఇ-మహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపోరా థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. వారిపైకి టెర్రిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో కాల్పులను తిప్పికొట్టింది భారత ఆర్మీ. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులిద్దరూ కశ్మీర్‌కు చెందినవారిగా స్థానిక పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉగ్రమూకలు. గత నాలుగు రోజులుగా పోలీసులు, భారత భద్రతా బలగాలు జరుపుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌లో ఇప్పటికీ నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు పీఓకే నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినవారు కాగా… ఇప్పుడు మాత్రం జైషే-ఇ-మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులుగా స్థానిక పోలీసులు గుర్తించారు.