TV9 Festival of India: సందడే సందడి.. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దాండియా-గర్బా డ్యాన్స్.. ఈ రోజు కార్యక్రమాలివే..

నవరాత్రి సందర్భంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గ్రాండ్ ఈవెంట్ అట్టహాసంగా కొనసాగుతోంది.. ఈ రోజు శుక్రవారం మూడోరోజు నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా మహా అష్టమి (అక్టోబర్ 11) రోజు సంధి పూజ, భోగ్ ఆరతి నిర్వహించనున్నారు.

TV9 Festival of India: సందడే సందడి.. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దాండియా-గర్బా డ్యాన్స్.. ఈ రోజు కార్యక్రమాలివే..
Tv9 Festival of India
Follow us

|

Updated on: Oct 11, 2024 | 12:16 PM

నవరాత్రి సందర్భంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గ్రాండ్ ఈవెంట్ అట్టహాసంగా కొనసాగుతోంది.. ఈ రోజు శుక్రవారం మూడోరోజు నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా మహా అష్టమి (అక్టోబర్ 11) రోజు సంధి పూజ, భోగ్ ఆరతి నిర్వహించనున్నారు. మహా అష్టమి రోజు భక్తులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజు సంధి పూజ నిర్వహిస్తారు. నవరాత్రుల అష్టమి.. నవమి మధ్య ఈ పూజ జరుగుతుంది. అష్టమి తిథి ముగింపు.. నవమి తిథి ప్రారంభంలో సంధి పూజ నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. దుర్గా అమ్మవారికి పూజలు.. అలాగే సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

సంధి పూజ తర్వాత భోగ్ ఆరతి..

ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సంధి పూజ తర్వాత, భోగ్ ఆరతి నిర్వహిస్తారు. ఇక్కడ దుర్గా మాతకు ఇష్టమైన రుచికరమైన ఆహారాన్ని నైవేధ్యం ఉంచడటంతోపాటు.. భక్తులకు అందిస్తారు.. నవరాత్రుల్లో ఇదో కీలక ఘట్టం.. అమ్మవారి దీవెనల కోసం భక్తులు ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉన్నారు. TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అయితే, ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దాండియా, గర్బా నైట్‌తో పాటు సాయంత్రం ఢక్-ధునుచి నృత్య పోటీలు కూడా ఉండనున్నాయి..

దాండియా/గర్బా నైట్: ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు దాండియా – గర్బా నైట్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో, సాంప్రదాయ నృత్యం, అద్భుతమైన పాటలు అందరినీ అలరిస్తాయి.

ధక్ – ధునుచి నృత్య పోటీలు: రాత్రి 8 నుండి 9:30 గంటల వరకు ఈ సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో 250కి పైగా స్టాళ్లు

TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మెగా లైఫ్‌స్టైల్ ఎక్స్‌పోలో అనేక దేశాల నుండి 250కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే ఈ గ్రాండ్ ఫెస్టివల్ అక్టోబర్ 13 వరకు కొనసాగుతుంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనచ్చు.. గ్లోబల్ లైఫ్ స్టైల్ ట్రెండ్‌లతో ఎంజాయ్ చేయవచ్చు.. ఇక్కడ అమ్మవారికి పూజ చేయడంతోపాటు.. అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించవచ్చు. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లతో పాటు రుచికరమైన వంటకాల స్టాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్యాషన్, గృహాలంకరణ, చేతిపనులతో సహా వివిధ రకాల ఉత్పత్తులను కలిగి ఉన్న 250 కంటే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి.. షాపింగ్ కూడా చేయవచ్చు.. లైవ్ మ్యూజిక్ షో ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. సూఫీ సంగీతం, బాలీవుడ్ పాటలు లేదా ప్రతి మూడ్‌లోని జానపద సంగీతం ఇక్కడికి వచ్చేవారిని మైమరిచిపోయేలా చేస్తాయి..

వీడియో చూడండి..