రతన్ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా ??
నిత్య నిరాడంబరుడు, మానవతావాది, దాతృత్వానికి మారుపేరు, వినయం, విధేయత, సాటి జీవుల పట్ల దయాహృదయం వెరసి ఎంతోమందికి ఆదర్శమూర్తి..స్పూర్తి రతన్ టాటా. వ్యాపార రంగంలో టాటా సంస్థను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఆయన వ్యాపారం చేసిన తీరు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేసింది. ఉప్పు మొదలు ఉక్కు వరకూ అన్ని రంగాల అభివృద్ధిలోనూ నాణ్యత, నమ్మకమే లక్ష్యంగా ఆయన కృషి అసమాన్యమైనది.
నిత్య నిరాడంబరుడు, మానవతావాది, దాతృత్వానికి మారుపేరు, వినయం, విధేయత, సాటి జీవుల పట్ల దయాహృదయం వెరసి ఎంతోమందికి ఆదర్శమూర్తి..స్పూర్తి రతన్ టాటా. వ్యాపార రంగంలో టాటా సంస్థను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఆయన వ్యాపారం చేసిన తీరు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేసింది. ఉప్పు మొదలు ఉక్కు వరకూ అన్ని రంగాల అభివృద్ధిలోనూ నాణ్యత, నమ్మకమే లక్ష్యంగా ఆయన కృషి అసమాన్యమైనది. అందుకే రతన్ టాటా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. భారతదేశాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. రతన్ టాట నేతృత్వంలో టాటా గ్రూప్ ప్రత్యేక ముద్ర వేసుకుంది. లాభార్జనకంటే చిత్తశుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందుకే రతన్ టాటా అంటే అందరికీ అపారమైన గౌరవం. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత రతన్‌టాటా. అయినా ఎప్పుడూ ఆర్భాటాలకు పోలేదు, ప్రచారాలు చేసుకోలేదు, వినయం, విధేయతే అలంకారాలుగా.. ఒక సామాన్య మానవుడిలా జీవించడానికే ఇష్టపడే రతన్ టాటా.. అదే సింపుల్‌సిటీతో టాటా సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశారు. ఈ క్రమంలో జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసి, టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్‌ను వరల్డ్ బ్రాండ్‌గా మార్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!
దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‌గా వార్నర్
ఆ హీరోయిన్ తో నారా రోహిత్ పెళ్లి ?? డేట్ ఫిక్స్ !!
ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

