దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‌గా వార్నర్
ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అనుబంధం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన వార్నర్.. అదే సమయంలో తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. కోవిడ్ సమయంలో వరుసగా తెలుగు సినిమాల పాటలు, డైలాగ్‌లతో రీల్స్, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు.
ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అనుబంధం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన వార్నర్.. అదే సమయంలో తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. కోవిడ్ సమయంలో వరుసగా తెలుగు సినిమాల పాటలు, డైలాగ్‌లతో రీల్స్, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ రాజమౌళితో కలిసి ఓ యాడ్ కూడా చేశాడు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల్లో నటిస్తే ఎలా ఉంటుందనే టాక్ ఆయన ఫ్యాన్స్‌లో వచ్చింది. ఇప్పుడు అది కాస్తా నిజమైంది. కొద్ది రోజుల క్రితం, డేవిడ్ వార్నర్ తెల్లటి చొక్కా ధరించి, తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత కూడా డేవిడ్ వార్నర్ సినిమాలో నటిస్తున్నాడనే వార్త వైరల్ గా మారింది. అయితే ఏ సినిమాలో నటిస్తాడనే విషయంపై స్పష్టత రాలేదు. కొంతమంది ‘పుష్ప2’ అన్నారు. అయితే అది నిజం కాదు. ఇక తాజా సమాచారం ప్రకారం నితిన్ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ హీరోయిన్ తో నారా రోహిత్ పెళ్లి ?? డేట్ ఫిక్స్ !!
ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

