ఆ హీరోయిన్ తో నారా రోహిత్ పెళ్లి ?? డేట్ ఫిక్స్ !!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నారా రోహిత్. మొదటి సినిమా బాణంతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తాను ఎంచుకునే సినిమాలతో.. టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నారా రోహిత్. మొదటి సినిమా బాణంతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తాను ఎంచుకునే సినిమాలతో.. టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 తర్వాత సుమారు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న రోహిత్ ఈ ఏడాది ప్రతినిధి 2 సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. నారా రోహిత్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నారా వారబ్బాయి ఓ ఇంటి వాడు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ హీరో నటించిన ప్రతినిధి -2 సినిమాలోని హీరోయిన్ సిరి లేళ్లతో ఉంగరాలు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగే ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీలు కూడా హాజరుకాబోతున్నాయని సమాచారం. అయితే నారా రోహిత్ నిశ్చితార్థం, పెళ్లి గురించి హీరో నుంచి కానీ అతని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

