ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??
వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధం ఉంది. సినిమాలంటే అమితంగా ప్రేమించే ఈయన..ఓ సారి ఓ డేర్ స్టెప్ వేశారు. బాలీవుడ్లో ఓసినిమాను నిర్మించారు. కానీ ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు.. దీంతో ఆ తర్వాత సినిమాల వంకే చూడడం మానేశారాయన. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ మూవీ
వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధం ఉంది. సినిమాలంటే అమితంగా ప్రేమించే ఈయన..ఓ సారి ఓ డేర్ స్టెప్ వేశారు. బాలీవుడ్లో ఓసినిమాను నిర్మించారు. కానీ ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు.. దీంతో ఆ తర్వాత సినిమాల వంకే చూడడం మానేశారాయన. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ మూవీ.! నలుగురు ప్రొడ్యూసర్స్ కలిసి నిర్మించిన ఈ మూవీకి రతన్ టాటా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ స్ఫూర్తితో ఏత్ బార్ సినిమా తెరకెక్కింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు జాన్ అబ్రహం, బిపాసా బసు, సుప్రియా పిల్గాంకర్ తదితరులు నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 7.50 కోట్లు మాత్రమే రాబట్టింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా మళ్లీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టలేద. అలా ప్రొడ్యూసర్‌గా ఆయన తీసిన మొదటి చిత్రమే చివరి సినిమా అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

