Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తౌఫ్తే తుఫాను ఎఫెక్ట్,…… ఢిల్లీలో భారీ వర్షం, రోడ్డుపై కుప్ప కూలిన ట్రక్కు, జనాలకు తృటిలో తప్పిన ప్రమాదం

తౌప్తే తుఫాను ప్రభావం ఢిల్లీలో కనిపించింది. దీని కారణంగా బుధవారం రోజంతా నగరంలో భారీ వర్షాలు కురిశాయి. అనేక చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి.

తౌఫ్తే తుఫాను ఎఫెక్ట్,...... ఢిల్లీలో భారీ వర్షం, రోడ్డుపై కుప్ప కూలిన  ట్రక్కు, జనాలకు తృటిలో తప్పిన ప్రమాదం
Truck Falls Into Caves Road Amid Heavy Rain In Delhi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 20, 2021 | 2:23 PM

తౌప్తే తుఫాను ప్రభావం ఢిల్లీలో కనిపించింది. దీని కారణంగా బుధవారం రోజంతా నగరంలో భారీ వర్షాలు కురిశాయి. అనేక చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. నజఫ్ గడ్ ప్రాంతంలో నిన్న రాత్రి వర్షాలకు కొంతవరకు కుంగిపోయిన రోడ్డులో ఓ భారీ ట్రక్కు మెల్లగా స్లిప్ అవుతూ కూలిపోయింది. అదృష్టవశాత్తూ అక్కడ జనాలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ భారీ వాహనం పడిపోతున్న దృశ్యాన్ని స్థానికులు వీడియో తీశారు. మెట్రో కన్ స్ట్రక్షన్ స్థలం వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని వారు దిగ్బంధం చేశారు. దాదాపు 50 ఏళ్ళ తరువాత ఢిల్లీ నగరంలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి.. మొత్తం 60 మీ.మీ. వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షంతో నగరంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. 23.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వారు పేర్కొన్నారు. 1951 తరువాత ఇంతగా ఉష్ణోగ్రత తగ్గడం ఇదే ప్రథమమని వారు చెప్పారు.

అటు తౌప్తే తుఫాను కారణంగా గుజరాత్ లో 13 మంది మరణించగా మహారాష్ట్రలో ఆరుగురు మృతి చెందారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ తుఫాను అపార ఆస్థి నష్టం కలిగించింది. వేలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని మోదీ వెయ్యికోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. ఆయన నిన్న ఈ రాష్ట్రాన్ని ఏరియల్ సర్వే చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )

Modi : గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. యువత, పిల్లల్లో వైరస్ సోకకుండా చర్యలు తీసుకోండి.. వైరస్ మ్యూటేషన్‌పై డైనమిక్‌గా ముందుకెళ్లండి : ప్రధాని

SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండిలా..? ఖాతా ఉపయోగాలు ఇలా..!