Traffic Violations: కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. రూల్స్ పాటించని వాహనదారులకు15 రోజుల్లోగా నోటీసులు
Traffic Violations: ట్రాఫిక్ నిబంధనలు రోజురోజుకు కఠినతరం అవుతున్నాయి. ఇక నిబంధనలు పాటించని వాహనదారులకు కొరఢా ఝులిపించనున్నారు అధికారులు. దీంతో కేంద్ర..
Traffic Violations: ట్రాఫిక్ నిబంధనలు రోజురోజుకు కఠినతరం అవుతున్నాయి. ఇక నిబంధనలు పాటించని వాహనదారులకు కొరఢా ఝులిపించనున్నారు అధికారులు. దీంతో కేంద్ర నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇక నుంచి 15 రోజుల్లోగా నోటీసు (ఈ-చలాన్) జారీ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించే వరకు సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం-1989కు ఇటీవల సవరణ చేసిన విషయం తెలిసిందే.
కొత్త నిబంధనల ప్రకారం..
వాహనదారుల కొత్త నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్‌లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలనిప పేర్కొంది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి.
కాగా, ఎన్ని ట్రాఫిక్ నిబంధనలు తీసుకువచ్చినా.. చాలా మంది ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, త్రిబుల్ రైడింగ్, వాహనానికి సరైన పత్రాలు లేకపోవడం, ఇతర నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. రూల్స్ అతిక్రమించడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా, చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు పదేపదే చెబుతున్నా.. ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా వాహనదారులు క్షేమంగా ఇంటికి చేరుకునేలా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎన్నో విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.
MoRT&H has issued a notification amending the Central Motor Vehicle Rules 1989 for “Electronic Monitoring and Enforcement of Road Safety”, wherein electronic enforcement devices will be used for issuing challan. These shall have an approval certificate of the State Government.
— MORTHINDIA (@MORTHIndia) August 19, 2021