మంచి కిక్కిచ్చే తెలుగు స్పోర్ట్ డ్రామాలు ఇవే..

27 December 2024

Battula Prudvi

పవన్ కళ్యాణ్, ప్రీతీ ఝాంగియానీ హీరో హీరోయిన్లుగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా సినిమా "తమ్ముడు" తప్పక చూడాలి.

నితిన్, జెనీలియా డిసౌజా, శశాంక్, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన "సై" రగ్బీ అనే ఓ స్పోర్ట్ ఉందని తెలిపిన చిత్రమిది.

నాని, శరణ్య మోహన్ జంటగా తెరకెక్కిన చిత్రం "బీమిలి కబాడీ జట్టు". ఇది ఆటతో పాటు స్నేహం అంటే ఏంటో చూపించిన సినిమా.

సుమంత్, స్వాతి రెడ్డి జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన "గోల్కొండ హై స్కూల్" తప్పక చూడవలసిన స్పోర్ట్స్ డ్రామా మూవీ.

వెంకటేష్, రితికా సింగ్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా "గురు". బాక్సింగ్ ఆధారంగా రూపొందింది ఈ సినిమా.

ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, శివకార్తికేయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన "కౌసల్య కృష్ణమూర్తి" తప్పక చూడాల్సిన మూవీ.

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జోడిగా నటించిన స్పోర్ట్ డ్రామా చిత్రం "జెర్సీ". ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కిన మాస్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్". లేడీస్ కబాడీ నేపథ్యంలో వచ్చిన చిత్రమిది.