AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian railways: తెలివి తెల్లారినట్లే ఉంది.. చలిగా ఉందని రన్నింగ్‌ ట్రైన్‌లో ఏకంగా..

వివరాల్లోకి వెళితే.. సంపర్క్‌ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు అస్సాం నుంచి ఢిల్లీకి వెళుతోంది. అదే సమయంలో జనరల్ కోచ్‌ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడాన్ని ఆర్పీఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోచ్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో భోగిలో ఉన్న కొందరు వ్యక్తులు ఎంచక్కా...

Indian railways: తెలివి తెల్లారినట్లే ఉంది.. చలిగా ఉందని రన్నింగ్‌ ట్రైన్‌లో ఏకంగా..
Representative Image
Narender Vaitla
|

Updated on: Jan 06, 2024 | 2:43 PM

Share

సాధారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం. ఉన్ని దుస్తులు ధరిస్తాం, మరీ తట్టుకోలేని పరిస్థితుల్లో చలి కాచుకోవడానికి మంట వేసుకుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌కి చెందిన కొందరు ప్రబుద్ధులు మాత్రం ఏకంగా కదులుతోన్న రైలులో చలి మంట కాచుకున్నారు. వినడానికి వెరైటీగా ఉన్నా నిజంగానే ఈ పనిని చేశారు.

వివరాల్లోకి వెళితే.. సంపర్క్‌ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు అస్సాం నుంచి ఢిల్లీకి వెళుతోంది. అదే సమయంలో జనరల్ కోచ్‌ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడాన్ని ఆర్పీఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోచ్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో భోగిలో ఉన్న కొందరు వ్యక్తులు ఎంచక్కా చలి మంట కాచుకుంటున్నారు. ఈ సీన్‌ను చూసిన పోలీసులకు ఒక్కసారిగా ఫ్యూజుల్‌ అవుట్‌ అయ్యాయి. వెంటనే మంటలు ఆర్పించారు. అనంతం భోగీలో ఉన్న చందన్, దేవేంద్ర అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని అలీగఢ్‌లోని ఆర్‌పీఎఫ్ పీఎస్ కు తరలించారు.

నిందితిలు ఇద్దరిని ఫరీదాబాద్‌ వాసులుగా గుర్తించారు. చలి ఎక్కువగా ఉండడం వల్లే తట్టుకోలేక మంట వెలిగించామని ఆర్ఫీఎఫ్‌కి సిబ్బందికి నిందితులు తెలిపారు. ఇక వారి దగ్గర పిడకలను పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అయితే చిన్న నిప్పు రవ్వ తగిలితేనే రైలు మొత్తం అంటుకునే సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈ ప్రబుద్ధులు ఏకంగా రైల్లోనే మంట పెట్టేశారు.

దీంతో పోలీసులు సైతం సీరియస్‌ రియాక్ట్ అయ్యారు. నిందితులను రైల్వే చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఆర్పీఎఫ్ అలీఘర్ పోస్ట్ కమాండర్ రాజీవ్ శర్మ చెప్పారు. వీరిద్దరితో పాటు విచారణ కోసం మరో 14 మంది ప్రయాణికులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకపోవడం అదృష్టమని చెప్పాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు
మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో
హాంకాంగ్ సిక్సెస్‌కు టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్
హాంకాంగ్ సిక్సెస్‌కు టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్
ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ..
ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ..