“టైగర్ అభీ జిందా హై”.. కాంగ్రెస్‌పై జ‌్యోతిరాదిత్య సింధియా ఫైర్..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలోకి చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్..

మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలోకి చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు మధ్య విపరీతంగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గతకొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌లు జ్యోతిరాధిత్య సింధియాపై విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి విమర్శలపై సింధియా తనదైన శైలిలో బదులిచ్చారు. “టైగర్ అభీ జిందా హై” అంటూ ఘాటుగా స్పందించారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కూల్చి.. బీజేపీ మళ్లీ అధికారం చేపట్టేందుకు జ్యోతిరాధిత్య సింధియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీకి రాజీనామా చేసి.. కమలం గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు నిత్యం సింధియాపై విమర్శలు చేస్తున్నారు. తనపై విమర్శలు చేసేవారందరికీ ఒక విషయం చెప్పదలచుకున్నానంటూ.. పులి ఇంకా బతికే ఉంది అంటూ వ్యాఖ్యానించారు.
#WATCH I don’t need any certificate from Digvijaya Singh and Kamal Nath. The facts are before the people how they looted the state in 15 months….I want to tell them ‘tiger abhi zinda hai’: BJP leader Jyotiraditya Scindia#MadhyaPradesh pic.twitter.com/GRdEIT7kcZ
— ANI (@ANI) July 2, 2020